దేవాలయం భూములను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం చీకటి జీఓ తీసుకోస్తుంది...ఎస్వీ మోహన్ రెడ్డి,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే...

దేవాలయం భూములను కొల్లగొట్టేందుకు 
కూటమి ప్రభుత్వం చీకటి జీఓ తీసుకోస్తుంది
ఎస్వీ మోహన్ రెడ్డి,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

దేవాలయం భూములను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం చీకటి జీఓ తీసుకోస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆ రోపించారు.ఈ మేరకు నగరంలోని ఎస్ వి కాంప్లెక్స్ లో శుక్రవారం విలేకరుల సమావే శం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ జిఓను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.న్యాయపోరాటానికి తాము సిద్ధంగా ఉన్నాం. ప్రజలను సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఎండోమెం ట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎటువంటి హక్కు లేదు.దేవుడినే ద్రోహం చేసేందుకు చంద్రబాబు,కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు.దీనిపై ప్రతి ఒక్కరు స్పందించాలని పిలుపునిచ్చారు.పప్పులు,బెల్లం అని దేవాలయా భూములను పంచుకుం టే తాము ఊరుకోమన్నారు.క్యాబినెట్ లో ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలి.దేవాలయం భూముల లీజ్,జీఓలపై కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన బిజేపి పార్టీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు ప్రజలకు హామీలు అమలు చేయాలి.ఎన్టీఆర్ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వ చ్చిన చంద్రబాబు.ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచి మోసం చేస్తున్నారు.మహానాడు లో జగన్ పై విమర్శలకు పరిమితమయ్యారు.సూపర్ సిక్స్ హామీల ఊసే లేదు,ప్రభుత్వ భూములు అస్మదీయులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు.ఎండోమెంట్ ల్యాండ్స్ టిడిపి నేత లకు ధారాదత్తం చేస్తున్నారు. సనాతన ధర్మం కాపాడే పవన్ కల్యాన్ ఎక్కడున్నాడో తెలి యడం లేదు.హిందూ దేవాలయ భూములు కొట్టేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లా డటం లేదు అని ప్రశ్నించారు.హిందు ధార్మికసంఘాలు అన్ని భూముల పరిరక్షణకు ముం దుకు రావాలి.దేవాదాయ భూముల రక్షణకు వైసిపి న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధం గా ఉంది అని ఆయన తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...