ట్రేడింగ్ స్కాంలతో వేల కోట్లు మాయం...

ట్రేడింగ్ స్కాంలతో వేల కోట్లు మాయం

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తారు.లక్షకు లక్ష వస్తాయని ఆశ పడి పోలోమంటూ వంద ల మంది పెట్టుబడి పెట్టారు. దాదాపుగా రూ.150కోట్లు వసూలు చేసిన ట్రేడింగ్ మోసగా ళ్లు రాత్రికి రాత్రి జెండా ఎత్తేశారు.ఈ మోసం హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో మధ్య తరగతి ప్రజలు నివాసం ఉండే కాలనీలో జరిగింది.ఓ చిన్న కాలనీని టార్గెట్ చేసుకుని చేసిన మోసంలోనే రూ.150 కోట్లు దోచుకెళ్లిపోయారు.ఇక దేశంలో ఎన్ని ఇలాంటి మోసాలు జరుగుతున్నాయో చెప్పడం కష్టం.ఈ స్కామ్స్ పరిధి వేల కోట్లలోనే ఉంటుం ది.

ట్రేడింగ్ పేరుతో విస్తృతంగా ప్రచారం :

ప్రతి ఒక్కరి వాట్సాప్ కు...ఇప్పుడు ట్రేడింగ్ గ్రూపులు తయారయ్యాయి. అవసరం లేక పోయినా...ఆసక్తి చూపకపోయినా...ఉచిత ట్రేడింగ్ చిట్కాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారు.ఆ మాయలో పడి చివరికి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.మల్టీ బ్యాగ ర్ స్టాక్స్ అని...రోజువారీ ట్రేడింగ్ లాభాలు అని ఆశ చూపి వారి సొమ్ము కాజేస్తున్నారు. మొదట్లో చిన్న మొత్తాల్లో లాభాలు ఇచ్చి భారీగా వసూలు చేశాక జెండా ఎత్తేస్తున్నారు.ఈ తరహా మోసాలు పెరిగిపోవడంతో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తు న్నారు.

స్టాక్ మార్కెట్ లాభాలపై విస్తృత ప్రచారం :

భారత స్టాక్ మార్కెట్ కొంత కాలంగా దూసుకెళ్తోంది.అప్పుడప్పుడూ ఒడిదుకుడుకులు చూసినా అంతిమంగా భారీ లాభాలను చూస్తోంది.పైగా అదే సమయంలో షేర్లు కొన డం,అమ్మడం వంటివి చేయడం చాలా ఈడీ అయిపోయింది.బ్యాంక్ అకౌంట్ల మాదిరిగా డీమ్యాట్ అకౌంట్లు అందుబాటులోకి వచ్చాయి.దీంతో అదో జూదంలా కొంత మంది ప్రా రంభిస్తున్నారు.చివరికి సర్వం కోల్పోతున్నారు.అలా కోల్పోయేది కాకుండా మోసాల బా రిన పడుతున్నారు.

స్టాక్ మార్కెట్ పై పూర్తి అవకాహన ఉంటేనే దిగడం మంచిది :

ఇవాళ పది రూపాయలు పెట్టి కొన్న షేర్ రేపు వంద అవుతుంది.ఒక్క రోజులోనే రూ.90 లాభం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది.కానీ మొత్తం స్టాక్ మార్కెట్ పై అవగాహన లే కుండా ఈ లాభం శాశ్వతం అనుకుంటే...అది ఓ గాలం అని తరవాత అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్లు స్థిరమైన పెట్టుబడులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి. అందులో నూ ఎన్ని మోసాలు ఉంటాయో చెప్పాల్సిన పని లేదు.స్టాక్ మార్కెట్ పై పూర్తి అవగాహ న ఉంటే తప్ప అందులో పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడం.ఇన్ ఫ్లూయన్సర్స్ మాటలు న మ్మకపోవడం మంచిది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...