ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఏడు మంది అరెస్ట్...రూ.91లక్షల నగదు స్వాధీనం,ఏడు మొబైల్ ఫోన్ లు సీజ్...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...
ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఏడు మంది అరెస్ట్
రూ.91లక్షల నగదు స్వాధీనం,ఏడు మొబైల్ ఫోన్ లు సీజ్
విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా,వ్యాస్ ఆడిటోరియంలో గత నెలలో జరిగిన జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమా వేశంలో బాగంగా చాలామంది యువకులు క్రికెట్ బెట్టింగ్ ను ఆన్ లైన్ లో ఆడుతూ, బెట్టింగ్ కు వ్యసనపరులుగా మారి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు చేసి మ రీ,ఆ అప్పులు తీర్చలేక ఇంట్లో తల్లితండ్రులకు చెప్పుకోలేక,తమ భవిష్యత్తు పై వారి తల్లి తండ్రులు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుచున్నాయని బెట్టింగ్ ను ఎలాగైనా అరికట్టాలని జి ల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు, ఆదోని డిఎస్పి ఎం.హేమ లత సూచనల మేరకు ఆదోని వన్ టౌన్ సిఐ కె.శ్రీరామ్, స్టేషన్ సిబ్బంది రాబడిన సమా చారం మేరకు ఈ నెల 18వ తేదీన ఆదోని వాల్మీకి నగర్ లోని వాల్మీకి గుడికి ఎదురుగా మొబైల్ ఫోన్ లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడి చేసి ఎస్.ఆర్.నాగరాజు ను అదుపులోనికి తీసుకోగా మిగిలిన ముద్దాయులు పారిపోయారు.అతని నుండీ నగదు రూ.50వేలు రూపాయలను స్వాదీన పరచుకుని ఆదోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేశారు.విచారణలో టెక్నాలజీ ఆధారంగా దొరికిన సమాచారం మేరకు సిఐ కె.శ్రీరామ్,సిబ్బంది కలిసి కర్నూలు,హైదరాబాదు,ఒంగోలు,చిలకలూరు పేట,బెంగ ళూరు సిటిలలో తిరిగి గత శుక్రవారం ఆదోని టౌన్ లోని ఎల్లమ్మ కొండలోని మర్రిచెట్టు దగ్గర ఏడు మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుం చి ఏడు మొబైల్ ఫోన్ లు,నగదు రూ.91,00,000 లక్షలు స్వాదీనం చేసుకున్నారు.ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి సాంకేతికత సహాయంతో క్రికెట్ బుకీలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన ఆదోని డిఎస్పీ హేమలత,ఆదోని ఒన్ టౌన్ సిఐ శ్రీరామ్, ఎఎస్సైలు,హెడ్ కానిస్టేబుల్స్,కానిస్టేబుల్స్ మునిస్వామి,రంగస్వామి,ఏకవీర,ఫక్కీరప్ప, హుస్సేన్ భాషాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.
ముద్దాయిల నుంచి స్వాదీనపరచుకున్న వాటి వివరాలు :
1. రూ.91,00,000 లక్షల నగదు.
2. 07 మొబైల్ ఫోన్ లు.
అదుపులోనికి తీసుకోబడిన ముద్దాయిల వివరాలు :
1. ఆదోని టౌన్,మసీదుపుర ఇస్మాయిల్ @ ఇస్మాయిల్ (44).
2. ఆదోని టౌన్,బోయగేరి,బోయ మహానంది (55).
3. ఆదోని టౌన్,మరాటి వీధి,బోయ రమేశ్ (26),
4. గౌరీబిధనూర్,చిక్కబళ్లాపూర్, కర్ణాటక,ప్రస్తుత నివాసం పురువంకర,సి.బ్లాక్ – 30 2,యలహంక,మదర్ డైరీ,బెంగళూరు సిటి,ఎస్.రాజేష్(38).
5. ఒంగోల్ జిల్లా,జరుగుమల్లి మండలం, ఎద్దులూరిపాడు గ్రామం,ప్రస్తుత నివాసం మంగ మూరు రోడ్,ఒంగోల్ టౌన్.చుండి శ్రీనివాస రావు @ నాయుడు(48).
6. ఒంగోల్ టౌన్,సత్యనారాయణపురం,అడ్డాల కల్యాణ్ (33).
7. రఘు ఆచారి అయిజ,ప్రస్తుతం హైదరాబాద్.
ముఖ్య గమనిక :
వీరు ఆడుతున్న క్రికెట్ బెట్టింగ్ యాప్స్
1. నేషనల్ ఎక్సేంజ్ 9,
2. రాధే ఎక్సేంజ్ ,
3. వజ్రా ఎక్సేంజ్,
4. నేషనల్ 777,
5. మోర్ ఎక్సేంజ్,

Comments
Post a Comment