ఫేస్‌బుక్‌లో యువతీతో పరిచయం...ఇంటికి లంచ్‌కు పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం...ఫొటోలు,వీడియోలు తీసి కోటి డిమాండ్...
ఫేస్‌బుక్‌లో యువతీతో పరిచయంఇంటికి లంచ్‌కు పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారంఫొటోలు,వీడియోలు తీసి కోటి డిమాండ్
VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్,బంజారాహిల్స్‌లో నివసిస్తున్న 24ఏళ్ల యువతికి 2023, ఫిబ్రవరిలో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహేంద్రవర్ధన్ అనే వ్యక్తి ఇద్దరు కొన్నాళ్లు ఫోన్లో మాట్లాడుకు న్న అనంతరం...అదే ఏడాది ఆగస్టు,15న ఆమెను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించా డు.ఇంటికొచ్చిన ఆమెకు మాటల్లో పెట్టి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.ఆ దారుణం అంత ఫొటోలు,వీడియోలు తీసి...మర్నాడు ఉదయం నిద్రలోంచి మేల్కొన్న ఆ మెకు ఆ ఫొటోలు,వీడియోలు చూపించి...తనకు రూ.20లక్షలు ఇవ్వాలని,లేదంటే వా టిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదురింపులకు గురిచేశాడు.దీంతో అతడు అడిగిన ఆ మొత్తాన్ని యువతి ఇచ్చింది.కాగా మరి కొన్నాళ్లుగా తనకు కోటి ఇవ్వాలంటూ బాధితురాలిని డిమాండ్ చేశాడు.ఈ నేపథ్యంలో యువతీ తాను అంత ఇచ్చుకోలేనని వే డుకున్నా...ఫొటోలు,వీడియోలు నెట్లో పెడతానంటూ బెదిరించడంతో బాధితురాలు పో లీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Comments
Post a Comment