వరంగల్‌లో నకిలీ కరెన్సీ స్కామ్...
వరంగల్‌లో నకిలీ కరెన్సీ స్కామ్
VS9TV న్యూస్,వరంగల్ క్రైం :
వరంగల్ జిల్లా,పర్వతగిరిలో దొంగ నోట్లు కలకలం రేపాయి.స్థానిక దుర్గశ్రీ వైన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగ నోట్లతో మద్యం కొనుగోలు చేశారు.ఈ డబ్బును బ్యాంక్‌లో జమ చేయడానికి వైన్స్ వాళ్లు వెళ్లగా..ఒక రూ.500,రూ.100 దొంగ నోట్లను బ్యాంక్ అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దొంగనోట్ల చలామణితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


Comments
Post a Comment