మోస్ట్ వాంటెడ్ హీడ్మా అరెస్ట్...
మోస్ట్ వాంటెడ్ హీడ్మా అరెస్ట్
VS9TV న్యూస్,భువనేశ్వర్ :
మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మరువక ముందే మరో కీల క నేతను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు.ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలోని జనగూడకు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి.ఈ క్రమంలో బోయిపరి గూడ పోలీసు స్టేషన్ పరిధిలోని పెటగూడ గ్రామ సమీపంలోని అడవుల్లో హిడ్మాను పోలీ సులు అరెస్టు చేశారు.ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచా రం అందడంతో పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహించినట్లు ఉన్నతాధికారులు పేర్కొ న్నారు.కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు.దీంతో మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.అ యితే చాలా మంది మావోయిస్టులు అక్కడ్నుంచి పారిపోయారు.మావోయిస్టు కుంజాం హిడ్మా మాత్రం అక్కడున్న చెట్ల పొదల్లో తలదాచుకున్నాడు.పోలీసులు అతన్ని అదుపులో కి తీసుకున్నారు.ఆ తర్వాత అతను హార్డ్కోర్ మావోయిస్టు హిడ్మా అని పోలీసుల విచారణ లో తేలింది.కుంజాం హిడ్మా ప్రస్తుతం ఏరియా కమిటీ మెంబర్ కొనసాగుతున్నారు.హి డ్మా నుంచి ఏకే 47 రైఫిల్, 35 రౌండ్ల బుల్లెట్లు,27 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్,90 నాన్ ఎల క్ట్రిక్ డిటోనేటర్స్,2 కేజీల గన్ పౌడర్, రెండు స్టీల్ కంటైనర్స్,రెండు రేడియోలు,ఒక ఇయ ర్ ఫోన్,వాకిటాకీ,బ్యాటరీ,రెండు కత్తులు,గొడ్డలి,నాలుగు టార్చ్ లైట్లు,ఒక పాలిథీన్ కవర్, మావోయిస్టు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు లభించినట్లు పోలీసులు పేర్కొన్నా రు.
కుంజం హిడ్మా అరెస్ట్ పోలీసులకు అతిపెద్ద విజయం :
కాగా హిడ్మా అరెస్టు భద్రతా బలగాలు సాధించిన మరో పెద్ద విజయంగా భావిస్తున్నారు. గతంలో ఇతడు హతమైనట్టు వార్తలు వచ్చినా ఆ తర్వాత అవి అవాస్తవమని తేలింది.చా లా కాలం పాటు కనీసం హిడ్మా ఫోటో కూడా లభించకుండా జాగ్రత్త పడ్డాడు.
కుంజం హిడ్మా హిస్టరీ :
ఛత్తీస్గఢ్ రాష్ట్రం,బీజాపూర్ జిల్లాకు చెందిన కుంజం హిడ్మా 2007,14 వయస్సులోనే మావోయిస్టు సంస్థలో చేరాడు.ఆయన అనేక మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని, 20 19లో ఏరియా కమిటీ మెంబర్ (ఏసీఎం)గా ఎదిగాడు.ఒడిశా,ఛత్తీస్గఢ్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లోని అనేక మావోయిస్టు సంఘర్షణల్లో పాల్గొన్నట్లు సమాచారం.ఒడిశాలోని కొరాపుట్, మల్కాన్జరి జిల్లాల్లో నమోదైన ఏడు ప్రధాన మావోయిస్టు కేసుల్లో అతడి పాత్ర ఉన్నట్లు పో లీసులు తెలిపారు.

Comments
Post a Comment