జగన్ అరెస్టుకు ముహుర్తం ఫిక్స్...సన్నిహితులతో సాయిరెడ్డి వెల్లడి...
జగన్ అరెస్టుకు ముహుర్తం ఫిక్స్సన్నిహితులతో సాయిరెడ్డి వెల్లడి
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఏపీ మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది.ఇప్పటికే ఈస్కాం లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి,రాజ్ కెసిరెడ్డి,సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధ నుంజయ్ రెడ్డి,జగన్ మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి,భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను నిందితులుగా చేర్చి,వీరిలో కొందరని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఇక తదుపరి అరెస్టు మాజీ సీఎం వైఎస్ జగన్ దేనన్న ప్రచారం ముమ్మరం గా సాగుతోంది.దీనిపై ఈ మధ్యే జగన్ కూడా స్పందించారు.అరెస్టుకు భయపడేది లేద ని,తాను విజయవాడలోనే ఉన్నానని జగన్ ఇప్పటికే చెప్పేశారు.ఈ నేపథ్యంలో సీఐడీ వే గంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు జగన్ ను అరెస్టు చేసేందుకు ప క్కా ప్రణాళిక సిద్దం చేస్తోంది.దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సన్నిహి తులకు ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ మధ్యే తిరుపతి వెళ్లిన విజ యసాయిరెడ్డి లిక్కర్ స్కాంలో జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారో వారికి వెల్లడించినట్లు స మాచారం.విజయసాయిరెడ్డి తన సన్నిహితులతో పంచుకున్న సమాచారం ప్రకారం లి క్కర్ స్కాంలో వైఎస్ జగన్ ను సీఐడీ వచ్చే నెల 10వ తేదీ లోపు అరెస్టు చేసే అవకాశా లున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ప్రభుత్వం పావులు కదుపుతోందని తెలుస్తోంది.అయితే సాయిరెడ్డి బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. తనను కెలకొద్దని మాత్రం ఇప్పటికే వైసీపీ లో జగన్ కోటరీగా ఆరోపిస్తున్న వారికి హెచ్చరికలు పంపారు.ఆ తర్వాత వైసీపీ కూడా సై లెంట్ గా ఉంటోంది.అయితే సాయిరెడ్డి చెప్పిన సమాచారం నిజమే అయితే మాత్రం జ గన్ విషయంలో కూటమి తీసుకునే నిర్ణయం,దాని పర్యవసానాలు ఎలా ఉండ బోతు న్నాయన్న దానిపై చర్చ జరుగుతోంది.మరోవైపు ఇప్పటికే ఓసారి మద్యం స్కాంలో సా క్షిగా హాజరై సీఐడీ సిట్ కు పలు వివరాలు వెల్లడించిన సాయిరెడ్డి...ఇప్పుడు ఈ స్కాంలో జగన్ అరెస్టుపై చెప్పారని భావిస్తున్న రహస్య సమాచారంపై వైసీపీ నేతలు మాత్రం స్పం దించడం లేదు.సాయిరెడ్డి వంటి కూటమికి అమ్ముడుపోయిన రోగ్ ఎంపీ చెప్పే మాటల కు విలువేముంటుందని జగన్ స్వయంగా వ్యాఖ్యానించారు.

Comments
Post a Comment