నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై ఆకస్మిక దాడులు...రూ.14లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టివేత...తొమ్మిది మంది అరెస్ట్...రిమాండ్ కు తరలింపు...నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్ బృందాలు...సునీల్ దత్,పోలీస్ కమిషనర్...
నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై ఆకస్మిక దాడులు
రూ.14లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టివేత
తొమ్మిది మంది అరెస్ట్...రిమాండ్ కు తరలింపు
నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్ బృందాలు
సునీల్ దత్,పోలీస్ కమిషనర్
రూ.14లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టివేత
తొమ్మిది మంది అరెస్ట్...రిమాండ్ కు తరలింపు
నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్ బృందాలు
సునీల్ దత్,పోలీస్ కమిషనర్
VS9TV న్యూస్,ఖమ్మం క్రైం :
దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతుకు తీరని నష్టం జరుగుతుంది.వారికి జరుగుతున్న అన్యా యం పట్ల ఎవరు స్పందించరు.పండించే పంట పండుతుందో లేదో అనే భయం ఒక వై పు,సరైన సమయానికి వర్షం పడుతుందో లేదో అనే ఆందోళన,చివరకు పండిన పంట కు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాల విఫలం కాగా,మరో వైపు నకిలీ విత్త నాలు,నకిలీ ఎరువులతో పంటలు పండక నష్టపోతున్నారు.దీంతో చేసిన అప్పులకు చె ల్లించలేక,కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కూడా వారిపై కనికరించక రైతుల జీవితాలతో చేలగాటమాడుతున్నారు.ఇప్పటి వరకు ప్రభుత్వాలు సైతం రైతులను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నాయి.అనేక హామీలు ఇస్తున్నాయి.కాని రై తుల సమస్యల పట్ల మాత్రం నిర్లక్షం వహిస్తునాయి.ఈ నేపథ్యంలోనే కొందరు అక్రమా ర్కులు రైతులను నిట్టనిలువుగా దోపిడీకి పాల్పడడం దారుణం.రైతు పంట కోసం ఉప యోగించే విత్తనాలను దుకాణాల నుండే నేరుగా నకిలీ విత్తనాలు ఇస్తున్నారంటే ఎంత దిగజారారో అర్థం చేసుకోవచ్చు.రోజురోజుకు నకిలీ విత్తనాలు విక్రయించే దుకాణాలు పు ట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి.ఇలాంటి పరిస్తితులపై తెలంగాణా,ఖమ్మం జిల్లా పోలీ సులు తీసుకున్న చర్యలు రైతుకు ఊరట కలిగిస్తున్నాయి.వివరల్లోకేలితే...ఖమం జిల్లాలో కుటీర పరిశ్రమల్లా నకిలీ ప్రత్తి విత్తనములు తయారు చేస్తున్న స్థావరంపై పోలీసు,వ్యవ సాయ శాఖ అధికారుల సంయుక్తంగా ఆకస్మిక దాడులు చేపట్టారు.మూడు వేర్వేరు కేసు ల్లో రూ.14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.తొ మ్మిది మందిని అరెస్ట్ చేసి,కేసు విచారణ చేస్తున్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ...ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా పక డ్బంది చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనా ల పేరుతో నాసి రకం,నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉ పేక్షించేది లేదని అన్నారు.ముఖ్యంగా .రైతులు సైతం విత్తనాలు కొనుగోలు సమయంలో అప్రమత్తత పాటించాలని,తక్కువ ధరలకు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు.కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి,తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి రైతులను మోసం చేస్తారని, ఇటువంటి వారిపై గ్రామాల్లో సైతం నిఘా పెట్టామని తెలిపారు.నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే మండల వ్యవ సాయ శాఖ అధికారికి గాని,స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మార్కెట్ లో నకిలీ విత్తనాల విక్రయం జరుగకుండా టాస్క్ ఫోర్స్ బృందాల నిరంతరం పర్యవేక్షణ వుంటుందని తెలిపారు.ఈ సమావేశం లో కల్లూరు ఏసీపీ రఘు,సత్తుపల్లి రూరల్ సిఐ ముత్తులింగం,ఎస్సై రఫి,ఎస్సై హరిత పాల్గొన్నారు.
కేసు వివరాలు :
ఈ నెల 28వ తేదీన పోలీస్ మరియు వ్యవసాయ అధికారుల ఉమ్మడి తనిఖీలలో భా గంగా ఏనుకూరు గ్రామానికి చెందిన గాజుల నరసింహారావు (49) అనే వ్యక్తి కొద్దిమంది రైతులకు అనుమతిలేని పత్తి విత్తనాలను అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా అతని వద్ద 450గ్రాములు బరువు గల అడ్వాన్స్ 555 పేర్లతో ఉమ్మడి పత్తి విత్తనాల ప్యాకెట్లు దొరకగా సీజ్ చేయడం జరిగింది.ఎస్సై కల్లూరు,డి.హరిత కల్లూరుతో ఒక టీం ఏర్పాటు చేసి తదుపరి విచారణ చేయడం జరిగింది.ఈ పత్తి విత్తనాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం,మైలవరం మండలానికి చెందిన చంద్రు గూడెం గ్రామానికి చెందిన శాలివా హన అనే వ్యక్తి వద్ద నుండి కిలో 450గ్రాముల ప్యాకెట్లను రూ.400 కొనుక్కొచ్చి ఇక్కడ రూ.1,200 రూపాయలకు అమ్ముతున్నాడని విచారణలో వెలుగులోనికి వచ్చింది.ఈ విష యంపై సిపి ఖమ్మం ఆదేశం ప్రకారం ఎస్సై డి.హరిత కల్లూరు ఆధ్వర్యంలో ఒక టీం ఏ ర్పాటు చేసి మైలవరం మండలం,చంద్రు గూడెం గ్రామానికి చెందిన శాలివాహన ఆర్.ఓ చంద్రు గూడెం ఇంటి వద్ద ఒక కుటీర పరిశ్రమలా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ట్టుగా గుర్తించారు.అతను కర్ణాటక నుండి ప్రతి విత్తనాలు,వాటిని ట్యాగ్ చేయడానికి ప్రిం టెడ్ అడ్వాన్స్ త్రిబుల్ ఫై నెంబర్ గల కవర్తో ఉన్న ప్యాకెట్స్ తో తీసుకొచ్చి,ఈ పత్తి విత్త నాలను రైజోబెల్ మిశ్రమాన్ని కలిపి ఆరబెట్టి ప్యాకెట్లలో నింపి సీల్ చేసి గాజుల నరసిం హారావు,మరి కొంతమంది ఏజెంట్లు ద్వారా రైతులకు అధిక దిగుబడి వస్తుందని అలాగే కలుప మందు వలన ఇబ్బంది ఉండదని,నమ్మించి ఒక్కొక్క ప్యాకెట్ రూ.1,200 రూపా యలకు రైతులకు అమ్ముతున్నాడని తెలిసింది.అతని ఇంటి వద్ద నుండి ఒక క్వింటా రైజో బెల్ మిశ్రమం కలిపి పెట్టి ప్యాక్ చేయన్ని పత్తి విత్తనాలు, 450గ్రాములు బరువు కలిగి అ రుణోదయ లేబల్ తో ఉన్న (272) పత్తి విత్తన ప్యాకెట్లను అలాగే ప్యాకెట్ సీల్ చేయ డానికి వాడే (2) మిషన్లు,ఒక వేయింగ్ మిషన్,ప్రత్తి విత్తనాలు పక్క చేయుటకు అరుణో దయ లేబుల్ తో ఉన్న సుమారు (400) ఖాళీ పాక్కెట్లు,రెండు లీటర్ల రైజోబెన్ మిశ్ర మంను సీజ్ చేయడం జరిగింది.మరో కేసులో ఈ నెల 27తేదీన ఏన్కూరు పోలీస్,మం డల వ్యవసాయ అధికారులు సంయుక్తంగా రేపల్లెవాడ గ్రామ శివారున నకిలీ పత్తి విత్తనా లు అమ్ముతున్నారనే సమాచారం మేరకు వెనిగండ్ల శ్రీహర్రావు అనే వ్యక్తి యొక్క వ్యవసా య భూమిలో తనిఖీలు నిర్వహించగా అక్కడ (210) ఒక కేజీ ప్యాకెట్లలో ఉన్న నకిలీ ప త్తి విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగినది.తదుపరి వెనిగండ్ల శ్రీధర్ రావు ఇచ్చిన సమాచారం మేరకు అతని అనుచరుడైన ఇమ్మినేని కిషోర్ ఇంటి వద్ద తనిఖీ చే యగా సుమారు 120 కిలోల పత్తి విత్తనాలు లభించాయి.అలాగే పత్తి విత్తనాలు తయా రు చేయడానికి ఉపయోగిస్తున్న రైజోబిన్ కెమికల్ మరియు వేయింగ్ మిషన్ ను స్వాధీ నం చేసుకోవడం జరిగింది. వెనిగండ్ల శ్రీహర్రావు గత కొంతకాలంగా బాపట్ల జిల్లాలో ఉ న్న తన బంధువైన లక్ష్మీనారాయణ ద్వారా కిలో రూ.800 రూపాయాలకి నకిలీ మరి యు ఎటువంటి అనుమతి లేని విత్తనాలు తెప్పిస్తూ ఏనుకూరు మండల రైతులకు అధిక ది గుబడి వస్తున్న వంగడాలని నమ్మించి కిలో రూ.2,600 రూపాయలకు అమ్ముచు లాభా లు గడిస్తున్నాడని విచారణలో తెలిసింది.అదేవిధంగా ఏన్కూరు ఎస్సైకి వచ్చిన సమాచా రం మేరకు ఏన్కూరు గ్రామంలో పోలేటి కోటేశ్వరరావు ఇంటి వద్ద తనిఖీ చేయగా అతని వద్ద నకిలీ ప్రతి విత్తనాల ప్యాకెట్ (20) ప్యాకెట్లు లభ్యమైంది.అతనిని విచారించ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలి జిల్లా నుండి తీసుకొచ్చి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రత్తి విత్తనాలను అమ్ముతున్నాడని తెలిసింది.
నిందుతుల వివరాలు :
GANG-1 :
A-1:- వెనిగండ్ల శ్రీహరి రావు తండ్రి: సంజీవరావు,(60),కమ్మ,వ్యాపారం R.o హిమం నగర్.
A2: ఉమ్మనేని నరేష్,(39) R/o ఏనుకూరు.
A3: అన్నెం లక్ష్మీనారాయణ (60),R/o భీమవరం గ్రామం,ఇంకొల్లు మండలం.
A-4:-గూగులోతు గోపి (40)R.o.హిమం నగర్.
A-5:- వరదబోయిన రమేష్,(40),R.o.రేపల్లెవాడ.
A6: తాంబళ్ళ నవీన్,R.o.రేపల్లెవాడ.
A7: దొంతబోయిన రమేష్,R.o.రేపల్లెవాడ.
SEIZED MATERIALS FROM GANG-1 :
1) (330) PACKETS OF 1 KG COTTON SEEDS
2) 2 Liters of Rizobin chemical
3) Weighing machine
GANG-2 :
A1: గాజుల నరసింహారావు,(49),R.o.ఏనుకూరు
A2:చర్లపల్లి శాలివాహన,(45),R.o.చంద్ర గూడెం,మైలవరం మండలం.
SEIZED MATERIALS FROM GANG-2 :
1) (1) QUINTAL OF LOOSE COTTON SEEDS
2) 270 packets of (450 Grams) cotton seed label with Arunodaya & Advance 555.
3) 1 Liter of Rizobin chemical
4) (2) Weighing machines
5) (2) electric sealing machines
6) (400) Empty packets label with Arunodaya & Advance 555.
GANG-3 :
1) పోలేటి కోటేశ్వరరావు(36),R.o.ఏనుకూరు గ్రామం.
2) వెనిగండ్ల రవి, (45),R.o.ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లా.
SEIZED MATERIALS FROM GANG-3 :
(20) PACKETS OF (450 Gram) PALLAVI COTTON SEEDS

Comments
Post a Comment