దేశంలోకల్లా పింఛన్లు రాష్ట్రంలోనే అధికం...ఇబ్బందులు అధిగమించి మాట ప్రకారం పింఛన్లు...మంత్రి టీజీ భరత్...

దేశంలోకల్లా పింఛన్లు రాష్ట్రంలోనే అధికం
ఇబ్బందులు అధిగమించి మాట ప్రకారం పింఛన్లు
మంత్రి టీజీ భరత్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

దేశంలోకెల్లా అధిక మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒ క్కటేనని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం 48వ వార్డు అమీర్ హైదర్ నగర్‌లో మంత్రి, నగరపాలక కమిషనర్ యస్.ర వీంద్ర బాబుతో కలిసి పలువురు లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ చేశారు.పింఛన్ల నగదు సక్రమంగా జరుగుతుందా? లేదా? అని లబ్దిదారులను ఆరా తీశారు.స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. బి.నాగమ్మ,సందేపోగు సుకుమార్‌,వడ్డే లక్ష్మీదేవి‌,యు.లక్ష్మన్నలకు వృద్ధాప్య,కే.డ్యాని, వి.రామకృష్ణలకు దివ్యాంగుల పించన్లు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ...ఆదాయం సమకూర్చుకోలేని వివిధ వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని,ఎన్ని ఆర్థి క ఇబ్బందులు ఉన్నా, వారికి క్రమం తప్పకుండా ప్రతి నెలా 1వ తేదీ,ఆరోజు సెలవు రోజు ఉంటే ఒకరోజు ముందే పింఛన్ల నగదు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని పే ర్కొన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గడిచిన 11నెలలుగా ఎలాంటి ఆటంకం లేకుం డా పక్కా ప్రణాళిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. దేశంలో పిం ఛన్ల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని,పేదల కోసం ప్ర భుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. పేదలకు రోజువారీ ఖర్చులకు పింఛన్ల నగ దు ఎంతగానో ఉపయోగపడుతుందని,అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తున్నామని పేర్కొన్నారు.అమీర్ హైదర్ నగర్ నందు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటు న్నామని,తొలి దశలో రూ.1.54 కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నామని పేర్కొ న్నారు.ఈ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగిందని,ఒక్కొక్కటిగా తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నా మని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచి ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ము ఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చుస్తారని పేర్కొన్నారు.కమిషనర్ మాట్లాడుతూ...దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పింఛన్ల పంపిణీ ఒక్క రాష్ట్రంలోనే పకడ్బందీగా జరుగు తుందని,వృద్ధులు,వికలాంగులు,వితంతువులు,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వా రికి ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల నగదు అందిస్తోందన్నారు. నగరంలో ప్రతి నెలా సుమా రు 36 వేల మందికి రూ.16కోట్ల రూపాయలు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఖర్చు చే స్తోందన్నారు.ఆమీర్ హైదర్ కాలనీ రహదారులు,డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు చే పట్టామని,రూ.40లక్షలతో డబ్లూబియం రహదారి నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ టెండర్ దశలో ఉందని, రూ.1.16కోట్ల సిసి రహదారి నిర్మాణానికి సైతం చర్యలు తీసు కుంటున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...