ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించి మందులు కొరత నివారించాలి

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించి మందులు కొరత నివారించాలి

సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సూపరిండెంట్,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి

ఏఐవైఎఫ్

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :

కర్నూలు నగర నడి బొడ్డులో ఉన్న ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మౌలిక వసతుల కొరత,మందుల కొరత వేధిస్తున్నాయని,వీటిని వెంటనే పరిష్కరించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జిల్లా కలెక్టర్ కి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు,నగర కార్యదర్శి బీసన్న,* నగర నాయకులు అఖిల్,రంగన్నలు మాట్లాడుతూ ఎంతోమంది పేద ప్రజలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వైద్యం కోసం వస్తే వైద్యశాలలో మౌలిక వసతులు కొరత మందుల కొరతతో పేదవారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందక రోగులు వేళ్ళకు వేలు ఖర్చుపెట్టి బయట మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ సమస్యను పరిష్కరించాలని వారు కలెక్టర్ కి విన్నవించారు.హాస్పిటల్లో మౌలిక వసతులపై ముఖ్యంగా క్షతగాత్రులు అత్యవసర విభాగానికి వస్తే వారిని ఎక్స్ రేకుగాని,స్కానింగ్ కానీ తీసుకెళ్లాలంటే స్ట్రక్చర్ల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని దీనివల్ల చాలామంది రోగులు ప్రవేట్ హాస్పిటల్ కి వెళ్లడం మరి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.స్ట్రక్చర్,మందుల కొరతపై హాస్పిటల్ సూపరిండెంట్ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు.సూపరిండెంట్లు మారుతున్నారు తప్ప సమస్య పరిష్కారం కాలేదన్నారు.కొత్తగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఐఏఎస్ అధికారి వచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలంగా తయారైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.కొత్తగా వచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ హాస్పిటల్ సమస్యలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. కొత్తగా ఏర్పాటైన వైద్య పరీక్షల విభాగంలో తీవ్ర గందరగోల పరిస్థితి ఏర్పడుతున్న ప్రత్యేక అధికారులు ఈ సమస్యల పైన ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారని వారు ప్రశ్నించారు. అదేవిధంగా కార్డియాలజీ,గైనకాలజీ వార్డులలో డాక్టర్లు చేతులకు వేసుకునే బ్లౌజుల సైతం, రోగికి అవసరమైన ఇంజక్షన్లు,సెలైన్ బాటలు,మాత్రలు మొత్తం బయట ప్రవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కోవలసిన పరిస్థితి దాపరిచిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మందుల కొరత,స్ట్రక్చర్స్ కొరత,కొన్ని వార్డులలో ఫ్యాన్లు పనిచేయడం లేదన్నారు. వీటన్నిటిపై నూతనంగా వచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలంటేనే హాస్పిటల్ అధికారులు భయపడే పరిస్థితి ఏర్పడిందని,కావున జిల్లా కలెక్టర్ స్పందించి హాస్పటల్లో తిష్ట వేసిన సమస్యలు పరిష్కరించి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...