మార్చి,1న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మంత్రాలయం రాక
మార్చి,1న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మంత్రాలయం రాక
భద్రతా ఏర్పాట్లు పరిశీలన
విక్రాంత్ పాటిల్.కర్నూల్ జిల్లా ఎస్పీ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం మార్చి,1న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.హెలిప్యాడ్ ప్రాంగణం,గెస్ట్ హౌస్,ఆలయ ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు.అనంతరం ఎస్పీ మాట్లాడారు.మంత్రి నారా లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను,సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మంత్రాలయం తెదేపా నాయకుడు రాఘవేంద్రరెడ్డి, ఎమ్మిగనూరు డిఎస్పి ఉపేంద్ర బాబు,స్పెషల్ బ్రాంచ్ సిఐ తేజ మూర్తి,మంత్రాలయం సీఐ రామాంజులు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment