శునకాల బెడద నియంత్రణకు చర్యలు

శునకాల బెడద నియంత్రణకు చర్యలు

శస్త్ర చికిత్స కేంద్రాన్ని పరిశీలన
 
చికిత్సలకు ఏడబ్లూబిఐ అనుమతులు మంజూరు

సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు ప్రారంభం

ఎస్.రవీంద్రబాబు,కమిషనర్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

కర్నూలు నగరంలో శునకాల బెడద నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అన్నారు. గురువారం ఆయన గార్గేయపురం డంప్ యార్డులోని శునకాల సంతాన నిరోధక శస్త్ర చికిత్స కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో కుక్కల బెడద నియంత్రణకు సంబంధించి,వాటికి సంతాన నిరోధక శస్త్ర చికిత్సలను తిరిగి పునః ప్రారంభించినట్లు వెల్లడించారు.ఏజెన్సీకి ప్రాజెక్ట్ రికగ్నేషన్ సర్టిఫికెట్ లేనందున గత ఏడాది ఆగస్టు,8న శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయని,తిరిగి ప్రారంభించేందుకు అనుమతుల కోసం ఇటీవల భారత జంతు సంక్షేమ మండలికి దరఖాస్తు చేసుకున్నామన్నారు.మండలి సభ్యురాలు గత నెల 8న శస్త్ర చికిత్స కేంద్రాన్ని పరిశీలించారని,ఇటీవల అనుమతులు మంజూరు చేశారన్నారు. దీంతో శునకాలకు శస్త్ర చికిత్సలను పునః ప్రారంభించడం జరిగిందని, ఒక్కొక్క శునక శస్త్ర చికిత్సక రూ.1500 ఏజెన్సీకి నగరపాలక వెచ్చిస్తుందన్నారు. నగరంలో దాదాపు 15వేల శునకాలు ఉండొచ్చని,గతంలో 10054 శునకాలకు ఆపరేషన్ చేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....