పత్తిపంట కొనుగోలు కేంద్రాలు పునః ప్రారంభించాలి.

పత్తిపంట కొనుగోలు కేంద్రాలు పునః ప్రారంభించాలి.

పత్తిపంటకు క్వింటాలుకు రూ.10వేలు పదివేలు ఇవ్వాలి 

ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :

పత్తిపంట కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని క్వింటాలుకు పదివేల రూపాయలు తక్కువ కాకుండా రైతులకు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ,ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ.కృష్ణ గూడూరు మండలం అధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.సోమవారం ప్రజా దర్బారులో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ను కలిసి రైతు సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జి. రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకుపైగా పత్తిపంట సాగు అయిందని,దిగుబడి కూడా ఈ సంవత్సరం కొంత మెరుగైందని ఎనిమిది క్వింటాళ్ల నుండి 12,13,14 క్వింటాళ్లు ఎకరాకు వచ్చాయని తెలిపారు.దిగుబడి వచ్చినప్పటికీ ధర లేకపోవడం వలన రైతులు పెట్టిన పెట్టుబడిదాకా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఖరీఫ్లో పండిన పంట నవంబర్ మాసం వరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు.
ఆదోని,మంత్రాలయం,ఎమ్మిగనూరు, కోడుమూరు మండలాలలో సుమారుగా 12కేంద్రాలలో ఏర్పాటుచేసి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రైతుల నుండి పత్తి కొనుగోలు చేశారు. కానీ ఉన్నట్లుండి నవంబర్ మాసం చివర్లో పత్తి కొనుగోలు కేంద్రాలు మూసివేశారు. ఫలితంగా రైతులు లబోదిబోమంటున్నారు.రైతులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు కొనుగోలు కేంద్రాలు మూసివేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికీ కర్నూలు జిల్లాలో 50వేల క్వింటాళ్ల వరకు రైతుల దగ్గర నిలువ ఉన్నాయని,ప్రారంభంలో తీసిన పత్తి ఇప్పటికీ రైతుల దగ్గర ఉన్నదని వాటిని కొనుగోలు చేయకపోతే రైతులు అమాంతం నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు.కావున కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి.కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించి పూర్తి పత్తిని కొనుగోలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.కలెక్టర్ రంజిత్ భాష సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే మార్కెటింగ్ వారు సిసిఐ వారితో కోఆర్డినేషన్ చేసుకొని తిరిగి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ భాష అదేచించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే. మధు,రైతులు సీతారాముడు,శివన్న, ఆంజనేయులు,షేక్షావలి,ఇంకా అనేక మంది రైతులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...