అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలోప్రత్యేక పూజలు,అన్నదానం...
అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో
ప్రత్యేక పూజలు,అన్నదానం...
దాసరి మోహన్,ఆలయ కమిటీ చైర్మన్
VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు అర్బన్ పరిధి,32వ వార్డ్,ముజఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ దాసరి మోహన్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు,వి.విజయ్ కుమార్,వి.చంద్ర, వి.నరసింహులు, వి.కృష్ణ,టి.నాగిరెడ్డిలతోకలిసి ఆలయంలో దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య,హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పర్వదినాలలో ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం జరుపుతున్నట్లు చెప్పారు.
అదేవిధంగా ఈ అమావాస్య నందు ఆలయం పూజారి విరుపాక్షయ్య ప్రత్యేక పూజల అనంతరం రామదారి గోత్రం రాజశేఖర్ (సైకిల్ షాప్ ), రమేష్,కుటుంబ సభ్యులు రాజ్యలక్ష్మి,రవీంద్ర,రాజేంద్ర,సుజాత,పూజిత,రాఘవేంద్రల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు.అదేవిదంగా దాతలు రాజశేఖర్, రమేష్ బాబు,మాజీ అధ్యక్షులు వడ్డె ఆంజనేయులు,వడ్డె చంద్రలను ఆలయ కమిటీ బృందం శాలువా,పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఆలయంలో జరుపుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు,ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.అలాగే సాయంత్రం భజన భక్త బృందం భజన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ భజన భక్తబృందం,భక్తులు,ప్రజలు పాల్గొన్నారు.
Comments
Post a Comment