ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ ఐపీ సేవల ప్రారంభం
ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ ఐపీ సేవల ప్రారంభం
డా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్
VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ లో మంగళవారం ఐపి సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్బంగా వారు వివరాలు వెల్లడించారు.స్టేట్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్ కు అత్యంత ఖరీదైన వైద్య పరికరాలు వచ్చాయి.మరికొన్ని త్వరలో రానున్నాయి.ఇప్పటికే సుమారు రూ.36 కోట్ల విలువైన లీనియర్ యాక్సిలరేటరీ, రూ.7 కోట్ల విలువైన సీటీ సిములేటర్ పరికరాలు చేరుకున్నాయి.ఇంత ఖరీదైన, అత్యాధునిక పరికరాలు రాష్ట్రంలోని ఏ ఇతర ప్రభుత్వాసుపత్రుల్లోనూ లేవని అన్నారు.అత్యవసర క్యాన్సర్ వైద్య విభాగపు సేవలు,ప్రస్తుతానికి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి నుంచి జరుగుతాయని చెప్పారు.లీనియర్ అక్లరేటర్ పరికరము రోగుల వైద్యసేవల కోసం అందుబాటులోకి రావడానికి ఏ ఈ ఆర్ బి అనుమతులు లభించవలసి ఉంది త్వరలో రావచ్చు అని తెలిపారు. స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రస్తుతానికి అందుబాటులో లేవని,సేవలు,పరీక్షలు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలోనే జరుగుతాయని పేర్కొన్నారు.రోగులకు సేవలు అందించటానికి
మేము ముందుంటామని అన్నారు. క్యాన్సర్ సర్జరీలకు దశలవారీగా వైద్య సేవలు ప్రారంభిస్తామని అన్నారు.త్వరలో ఆసుపత్రికి సిమెన్స్ కంపెనీకి సంబంధించిన అత్యాధునిక (CT Scanning Machine) CT - సిటి స్కానింగ్ మిషన్ అందుబాటులోకి వస్తున్నదని అన్నారు.దీని ద్వారా పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.చిట్టి నరసమ్మ,స్టేట్ క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ డైరెక్టర్ డా.సి.ఎస్.కె.ప్రకాష్, సి.ఎస్.ఆర్.ఎమ్.ఓ డా.హేమనలిని, క్యాన్సర్ విభాగపు వైద్యులు, డా.ఉమామహేశ్వర్ రెడ్డి,హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డా.కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment