అక్రిడిటేషన్ లను త్వరితగతిన పునరుద్దఃరించాలి


అక్రిడిటేషన్ లను త్వరతగతిన పునరుద్ధరించాలి

కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నగర కమిటీ

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :

జర్నలిస్టుల అక్రిడిటేషన్ లను త్వరతగతిన పునరుద్ధరించాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యూజేఎఫ్) నాయకులు అన్నారు.సోమవారం జిల్లా,కలెక్టర్ కార్యాలయం,సునయన అడిటోరియం,ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాషను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నగర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పి.నాగేంద్రుడు,జి.మునిస్వామి మాట్లాడుతూ...జర్నలిస్టులకు ప్రభుత్వం మంజూరు చేసిన అక్రిడిటేషన్ కాలపరిమితి ఈనెల 28వ తేదీతో గడువు ముగియనుందన్నారు.కావున త్వరితగతిన నూతన అక్రిడిటేషన్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.లేనిపక్షంలో జర్నలిస్టులు తమ బస్సు చార్జీల రాయితీలను నష్టపోవాల్సి వస్తుంది.వెంటనే అక్రిడిటేషన్ లో పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించి మార్చి,1వతేదీ లోపలనే జర్నలిస్టులు అక్రిడిటేషన్లను పునరుద్ధరించి ఆర్టీసీ చార్జీలో రాయితీకి ఆటంకం రాకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లా కలెక్టర్ స్పందిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిఫారస్ చేశారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో యుజెఎఫ్ జిల్లా నాయకులు నీలం సత్యనారాయణ, చంద్రమోహన్,విజయ్ కుమార్, మల్లికార్జున,నగర కోశాధికారి రాజశేఖర్, నాయకులు అసిఫ్,వరప్రసాద్, జయరాజు,రవిగౌడ్,కరణ్,ప్రసాద్,శేఖర్, లోకేష్,రవి,ఉరుకుందు,సంజీవయ్య, జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...