సర్వేనెంబర్ 142 వక్ఫ్ భూముల కొనుగోలు నిలిపివేయాలి...ఆవాజ్ కమిటీ డిమాండ్...

సర్వేనెంబర్ 142 వక్ఫ్ భూముల కొనుగోలు నిలిపివేయాలి
ఆవాజ్ కమిటీ డిమాండ్
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
జోహారాపురం గ్రామపరిధి,సర్వేనెంబర్ 142 వ క్ఫ్ భూముల కొనుగోలు నిలిపి వే యాలని,వ క్ఫ్ బోర్డు స్థలాన్ని కబ్జాకోరుల నుండి రక్షించా లని ఆవాజ్ నగర అధ్యక్ష కార్యదర్శులు పీ.ఇ క్బాల్ హుస్సేన్,ఎస్.ఎం.డి.షరీఫ్ లు బుధ వారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దాదాపు రూ.100కోట్లకుపైగా విలువ చేసే స్థలాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యా పారస్తులు వక్ఫ్ బోర్డు స్థలాన్ని అక్రమ రిజి స్ట ర్లు చేయించి,ప్లాట్ల రూపంలో వేయడం వల్ల ప్రజల మోసపోయారని వారు తెలియజేశా రు.వక్ఫ్ బోర్డు స్థలాన్ని అమ్మడం గాని,కొనడం గాని జరగదనే విషయం ప్లాట్ లు కొన్న వారికి తెలియకపోవడంతో అధికారులు అక్రమ రిజి స్టర్లు చేయడం వల్ల ముస్లిం సమాజానికి రూ.1 00 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, దీంతో తీరని లోటు కలిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సర్వే నంబర్ 142లో కెపి వెంక ట్ రెడ్డి నగర్ పేరుతో కొందరు స్థిరాస్తి వ్యాపా రులు స్థిరాస్తి వెంచర్ వేశారు.(డైరెక్టర్ ఆఫ్ టౌ న్ అండ్ కంట్రీ ప్లానింగ్) అధికారులు అను మ తులు ఇచ్చారు.109 ప్లాట్లు వేసి అమ్మే శారు. వీళ్లు ఎవరు అనుమతి ఇవ్వడానికి,వారు ఎవ రు ప్లాట్లు వెయ్యడానికి అని వారు ఘాటుగా ప్రశ్నించారు.కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే ప్ర ధాన రహదారికి సమీపంలో ఉండడంతో చా లామంది స్థలాలు కొనుగోలు చేశారు.అప్పట్లో ఆ ప్రాంతం నగరానికి శివారులో ఉండేది.ప్రస్తు తం నగరం విస్తరించిన నేపథ్యంలో అక్కడ ఎ కరా రూ.10 కోట్లు పలుకుతోంది.దీన్ని ఆసరా గా చేసుకొని ల బ్ధిదారులను కబ్జాకోరులు మో సం చేశారని వారు వివరించారు.కొంతమంది స్థలాలను తీసుకొని ఇళ్ళ నిర్మాణం చేపట్టా రు.ఇది వక్ఫ్ భూమి అని నిషేధిత జాబితాలో ఉంచాలనే ఇంకిత జ్ఞానం అధికారుల కు లేదా అని వారు ప్రశ్నించారు.అలాంటి చర్యలేవి తీ సుకోకపోవడంతో చాలా మంది స్థలాలు కొను గోలు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు.దీనికి నైతి క బాధ్యత వక్ఫ్ బో ర్డు అధికారులది.కబ్జాకో రులదని స్పష్టం చేశారు.ఇప్పటికైనా వక్ఫ్ బో ర్డు అధికారులు తక్షణమే 142 సర్వేనెంబర్ స్థ లంలో రిజిస్టర్లు రద్దుచేసి తిరిగి,వక్ఫ్ బోర్డులో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...