కూటమి సర్కార్ సంచలన నిర్ణయం...ట్రా న్స్‌జెండర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు...
కూటమి సర్కార్ సంచలన నిర్ణయం
ట్రాన్స్‌జెండర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు
సమాజంలో దశాబ్దాలుగా వివక్ష,నిరాకరణ,ఉ పాధి లేమి,గుర్తింపు సమస్యలతో సతమతమ వుతున్న ట్రాన్స్‌జెండర్ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండంత భరోసా ఇచ్చింది.ట్రాన్స్‌జెం డర్ల హక్కుల పరిరక్షణ,వారి సామాజిక అభి వృద్ధి కోసం ప్రత్యేకంగా ‘రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు’ ను ఏర్పాటు చేస్తూ, దానికి ప్రతినిధులను ని యమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ ఎంఎ స్ నంబర్ 14ను విడుదల చేసింది.కేంద్ర ప్ర భుత్వం తీసుకొచ్చిన ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్-2019’, ‘రూల్స్-2 020’ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చే పట్టింది.మహిళా,శి శు,దివ్యాంగులు,వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో ఈ బోర్డు పనిచేస్తుంది.ఈ బోర్డులో వి విధ ప్రాంతాల నుంచి ప్రతినిధులను ప్రభు త్వం నామినే ట్ చేసింది.ఆంధ్రా ప్రాంత ప్రతిని ధిగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్,రాయలసీమ ప్రాం త ప్రతినిధిగా తిరుపతి జిల్లా కలెక్టర్ వ్య వహరిస్తారు.ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులుగా కో టా ప్రేమ్ సాగర్ రాయ్ (తూర్పుగోదావరి),న క్క జీవన్ కుమారి (గుంటూరు),బోను దుర్గ (ప్రకాశం)లను సభ్యులుగా నియమించారు.వీ రు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రెండేళ్ల పాటు లేదా ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇ చ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.కు టుంబాల నుంచి వెలివేత,విద్యావకాశాలు కో ల్పోవడం,వైద్య సేవల్లో చిన్నచూపు వంటి స మస్యలకు ఈ బోర్డు పరిష్కారం చూపనుంది. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ల సమస్యలను గుర్తిం చి నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం.విద్య, ఉపాధి,ఆరోగ్య రంగాల్లో వివక్ష లేకుండా చూడ టం.వీరికి ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణలు,సా మాజిక భద్రత కల్పించడంపై బోర్డు కీలక సూ చనలు చేస్తుంది.వారి సంక్షేమానికి తీసుకోవ ల్సిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్ల డం వెల్ఫేర్ బోర్డు ముఖ్య ఉద్దేశ్యం.ట్రాన్స్‌జెం డర్లపై వివక్షను నిషేధిస్తూ,వారిని సమాజ ప్రధా న స్రవంతిలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తం గా చర్చనీయాంశమైంది.ఈ వెల్ఫేర్ బోర్డు ద్వా రా ట్రాన్స్ జెండర్ వర్గాల్లో కొత్త ఆశలు చిగురి స్తున్నాయి.ఇది వారి ఆత్మగౌరవ పోరాటంలో ఒక కీలక విజయంగా నిలవనుంది.
Comments
Post a Comment