జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ సెర్చ్ ఆపరే షన్ డే ”...సరైన పత్రాలులేని 40వాహనాలు స్వాధీ నం...కర్నూలు జిల్లా పోలీసులు...

జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ సెర్చ్ ఆపరే షన్ డే ”
సరైన పత్రాలులేని 40వాహనాలు స్వాధీనం
కర్నూలు జిల్లా పోలీసులు
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ కు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వ జ్రప్రహార్” లో భాగంగా రాష్ట్ర డిజిపి హరీష్ కు మార్ గుప్తా ఆదేశాల మేరకు,ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో,కర్నూలు జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్ ఆధ్యర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్‌లలో శనివారం మెగా కా ర్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వ హించారు.పత్తికొండ సబ్ డివిజన్,వెల్దుర్తి గ్రా మం,ఎమ్మిగనూరు సబ్ డివిజన్,నందవరం పీఎస్ పరిధిలోని,కనకవీడు గ్రామం,ఆదోని సబ్ డివిజన్,పెద్ద తుంబళం పీఎస్ పరిధిలో ని కుప్పగల్ గ్రామం,కర్నూలు సబ్ డివిజన్,క ర్నూలు తాలుకా పియస్ పరిధిలోని వెంకన్న బావి,దిన్నెదేవర పాడు,అంబేద్కర్ నగర్ ప్రాం తాలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహిం చారు.ఈ సందర్బంగా మాదకద్రవ్యాల విని యోగం,అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.డిఎస్పీలు,సిఐలు, ఎస్సైలు,స్పెషల్ టీంలు,పోలీసు సిబ్బంది మొత్తం 162 మంది పాల్గొన్నారు.హాట్ స్పాట్ ప్రాంతాలలో విస్తృ తంగా తనిఖీలు చేపట్టారు.500 ఇళ్ళను తని ఖీలు చేశారు.2,500మందిని తనిఖీలు చేశా రు.120వాహనాలను తనిఖీలు చేశారు.మాద క ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య,సా మాజిక,చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు.గంజాయి,ఇతర మా దక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తు ను నాశనం చేస్తుందని,కుటుంబ వ్యవస్థపై తీ వ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.ప్రజ లు త మ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమా చారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెం బర్ 1972కు సమాచారం అందించాలని పోలీ సులు విజ్ఞప్తి చేశారు.సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచ బడతాయ ని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు,సిబ్బంది,ప్రజలతో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేయించారు.సమాజాన్ని డ్రగ్స్ రహితం గా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ము ఖ్యమని ఈ సందర్భంగా పోలీసు అధికారులు పేర్కొన్నారు.మాద కద్రవ్యాలను పూర్తిగా అరిక ట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్ర హార్” లో భాగంగా ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయ ని పోలీసు అధికారులు తెలిపారు.ప్రజల సహ కారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడ మే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నా రు.ఈ కార్యక్రమంలో పత్తికొండ డిఎస్పీ వెంక ట్రామయ్య,ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి,కర్నూ లు ఇన్చార్జి డిఎస్పి ఉపేంద్ర బాబు,సిఐలు,ఎ స్సైలు,స్పెషల్ టీం,పోలీసు సిబ్బంది పాల్గొన్నా రు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....