అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన గణేష్ నగర్ పార్క్...పిర్యాదు చేసిన చర్యలు శూన్యం...పట్టించుకోని అధికారులు...అగ్ర హిస్తున్న స్థానికులు...
అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన గణేష్ నగర్ పార్క్
పిర్యాదు చేసిన చర్యలు శూన్యం
పట్టించుకోని అధికారులు
అగ్రహిస్తున్న స్థానిక వాసులు
ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి, మే,25 :
నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి వార్డులో ప్రజ ల ఆరోగ్యం,ఆనందం,ఆహ్లాదం కోసం పార్క్ ల కోసం కొంత స్థలాన్ని కేటాయిస్తారు.ఆ స్థలంలో స్థానిక ప్రజల కమిటీ బృందం విజ్ఞాపన మేరకు ఆ పార్క్ లో ఉదయం, సాయంత్రం స్త్రీ,పురుషు లు,పిల్లలు,వయోవృద్ధులు నడక కోసం,పిల్లలు ఆడుకోవడానికి కావలసిన వసతులు అన్ని అందులో ఏర్పాటు చేస్తారు.ప్రధానంగా పిల్లల కోసం ఊయల,జారుడు బండ,సైక్లింగ్,గుండ్రం గా తిరిగే పరికరాలు వివిధ రకాల వ్యాయా మం చేసుకునే వీలుగా పరికరములను ఏర్పా టు చేస్తారు.దీంతో పిల్లలు యువకులు మహి ళలు వృద్ధులు వాటిని ఉపయోగించుకొని ఉదయం,సాయంత్రం పార్కులకు వెళ్లి ఎవరికి కావాల్సిన వ్యాయామాలు వారు చేసుకుంటూ తమ ఆరోగ్య పరిరక్షణ,మానసిక ఉల్లాసం పొందుతారు.అందుకోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు.
అయితే కొన్ని పార్క్ లు నిర్వహణ లోపం వల్ల నిర్మానుష్యంగా మారుతున్నాయి.అలాంటి పా ర్క్ ల్లో అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి.ఇదే క్రమంలో నగరంలోని గ ణేష్ నగర్ కాలనీలోని పార్క్ కమిటీ నిర్వహ ణ సక్రమంగా లేకపోవడంతో ఆకతాయిలు, మందుబాబులకు అడ్డాలుగా మారింది.పార్క్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆక తాయిలు సిగరెట్లు,గుట్కాలు తినడం,మరి కొం తమంది పార్క్ లోనే బీర్ లు,లిక్కర్ తాగుతూ బాటళ్లు అక్కడే వేయడం,పగులగొట్టం జరు గుతుంది.దీంతో ఆ పార్క్ లో జరుగుతున్న వ్యవహారాలను అధికారులకు పిర్యాదు చేసిన స్పందన కరువైందని స్థానిక ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు పార్క్ పక్కల రహదారి ఉండడం వల్ల స్థానిక ప్రజలు అదే దారిలో వస్తూ,వెళుతూ ఉంటారు.ఈ నేప థ్యంలో రహదారిలో నడిచి వెళ్ళడానికి యువ తులు,మహిళలు భయాందోళనకు గురవుతు న్నట్లు చెపుతున్నారు.ఈ దుస్థితి పట్ల నిర్వ హణ కమిటీ నిర్లక్ష్యం తగదని పేర్కొంటున్నా రు.దీంతో ప్రస్తుతం పార్క్ లో ఉన్న పరికరాలు నిరూపయోగంగా ఉన్నాయి.వాటిని స్థానికులు ఉపయోగించకపోవడం వల్ల తృప్పు పట్టి పా డైపోతున్నట్లు తెలిపారు.అధికారులు స్పందిం చకపోతే చివరికి మందుబా బులు,ఆకతాయి లు వారి అవసరాల కోసం పరికరాలను తీసు కెళ్ళి పాత సామాన్లకు ఒక్కొక్కటి అమ్ముకోవ డం మొదలు పెడతారని ఆవేదన చెందుతు న్నారు.నగరపాలక సంస్థ ప్రభుత్వ స్థలాలపై అజమాయిషి,నిఘా లేకపోతే రాజకీయ నా యకుల అండదండలతో వారి అనుయాయు లు పట్టాలు తీసుకుని కబ్జా చేసే అవకాశం ఉం దని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కావున పార్క్ లో జరుగుతున్న దారుణాల పట్ల సం బంధిత అధికారులు స్పందించాలని,ఆకతా యిలు,మందుబాబుల చర్యలను అరికట్టి,పా ర్క్ లోని పరికరాలు స్థానిక ప్రజలు ఉపయో గించుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు,మహిళలు కోరుతున్నారు.
శ్యామల,ఐద్వా జిల్లా అధ్యక్షురాలు
కర్నూలు అర్బన్ ప్రాంతంలో ఉన్న పార్కుల ను కార్పొరేషన్ మంచిగా తీర్చిదిద్ది సెలవుల్లో పిల్లలు ఆడుకోవడానికి కావలసిన పరికరాలు ఏర్పాటు చేయాలి.కొన్ని పార్కులలో సంపులు ఏర్పాటు చేశారు.అవి తెరిచి ఉండడం వల్ల అందులో పిల్లలు ఆడుకుంటూ పడి చనిపో యిన సంఘటనలు కూడా ఉన్నాయి.సంపుల పై మూతలు ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. పార్కు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చు ట్టూ రక్షణ గోడలుగాని,కంచలుగాని ఏర్పాటు చేయాలి.పార్క్ ల్లో అసాంఘీక కార్యక్రమాలు జరగకుండా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచే యాలి.పార్కులు నిరుపయోగంగా ఉంటే అక్క డ ఆయా ప్రాంతాల్లోని ప్రజలు చెత్తాచెదారం వే యటమే కాకుండా,పిచ్చి మొక్కలు కంపచెట్లు పెరిగి,డ్రైనేజీ,వర్షపు నీరు చేరి పందు లు,దోమ లు,కుక్కలకు నిలయంగా మారుతున్నాయి. పార్కులను శుభ్రంగా ఉంచే బాధ్యత కూడా న గరపాలక సంస్థ తీసుకోవాల్సిన అవసరం ఎం తైనా ఉంది.అదేవిదంగా పార్కులలో నీడని చ్చే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి.
అబ్దుల్లా,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
నగరంలోని పార్కులను వినియోగంలోకి తీ సుకువచ్చి,విద్యార్థులు సెల్ఫోన్లకు అతుక్కు పోకుండా పార్కుల్లో ఆడుకునే విధంగా ఏర్పా టు చేయాలి.పార్కుల అభివృద్ధి కుంటు పడ డంతో ఆ పార్కులలో కొంతమందికి అసాంఘి క కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి.కార్పొ రేషన్ వారు ప్రజలపై విపరీతమైన పన్నుల భారాల మోపుతూ ప్రజలకు సౌకర్యాలు కల్పిం చకుండా,ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు.అధి కారులు పార్కులను నిరుపయోగంగా పెట్ట కుండా ప్రజలకు అందు బాటులోకి తెచ్చి ప్రజ ల ఆరోగ్యాలను కాపాడాలి.అన్ని పార్కులలో వ్యాయామ పరికరాలు పెట్టాలి.వేసవిలో పిల్ల లకు పార్కులను వినియోగంలోకి తేవాలి.అ ధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ప్రజలకు పార్క్ ల ను అభివృద్ధి చేసి,వారి ఆరోగ్యం కోసం ఉప యోగపడేలా చర్యలు తీసుకోవాలి.
Comments
Post a Comment