పెంచిన పెట్రోల్ డీజిల్,గ్యాస్ ధరలు ఉపసం హరించుకోవాలి...సీఐటీయు డిమాండ్...
పెంచిన పెట్రోల్ డీజిల్,గ్యాస్ ధరలు ఉపసం హరించుకోవాలి
సీఐటీయు డిమాండ్
ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్, డీ జిల్ ధరలు భారీగా పెంచుతూ సామాన్య ప్రజ లపై రవాణా రంగం కార్మికులపై పెనుబారం మోపిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరే కంగా జిల్లా వ్యాప్త ఆందోళనలో భాగంగా ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్ యూనియన్ న్యూ సిటీ క మిటీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కర్నూలు కొ త్త బస్టాండ్ ఇన్ గేటు ముందు శనివారం రా స్తారోకో కార్యక్రమం ఆటో యూనియన్ న్యూ సిటీ ఉపాధ్యక్షులు పి.నబి సాహెబ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా సిఐటియు న్యూ సిటీ అధ్యక్ష,కార్యదర్శులు నగేష్,ఆర్,న రసింహులు,ఆటో యూనియన్ సీఐటీయు జి ల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ మాట్లాడు తూ భారీగా పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.పెంచిన పెట్రోల్,డీజిల్ ధరల వల్ల పేద మధ్యతరగతి ప్రజలపై ఆటో డ్రైవర్లపై పెను బారంగా మారిందని,నరేంద్ర మోడీ నియంతృ త్వ ధోరణి విడనాడాలని,ఒకపక్క ఆధిపత్యం కోసం యుద్ధం వల్ల అనేక దేశాలు అతలాకుత లం అవుతుంటే, కనీసం యుద్ధం నివారించాల ని ప్రకటన కూడా చేయకపోవడం నరేంద్ర మో డీ రాక్ష సత్వానికి నిదర్శనమని అన్నారు.గతం లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన సమయంలో కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు తగ్గిం చకుండా కేవలం ఆయన కనుసన్నల్లో ఆయన కు ఆదికం తెచ్చే బడాబాబులకు మాత్రమే వె సులుబాటు కల్పించడం కోసం పెట్రోల్,డీజిల్ తగ్గించకుండా కొనసాగించడం,నేడు క్రూడ్ ఆ యిల్ ధరలు పెరిగాయని,కుంటి సాపుతో ఆదా ని,అంబానీలకు లాభాలు చేకూర్చడం కోసం పె ట్రోల్,డీజిల్ ధరలను అమాంతం పెంచడం ఎం తవరకు సమంజసమని ప్రశ్నించారు.నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పని చేస్తు న్న టిడిపి,జనసేన పార్టీల అధినేతలు కూడా ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతూ బి జెపి ప్రభుత్వానికి దాసోహమై,రాష్ట్ర ప్రయో జనాలను పక్కనపెట్టి సామాన్యులపై భారం ప డుతున్న సందర్బంగా నరేంద్ర మోడీ ప్రభుత్వా న్ని ప్రశ్నించాల్సింది పోయి,బడాబాబులకు మే లు చేసే విధంగా రాష్ట్ర నాయకత్వం పని చే యడం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తుంగ లో తొక్కడమే అని మం డిపడ్డారు.ఎన్నికలకు ముందు కల్లిబల్లి మాటల్లో చెప్పిన చంద్రబా బు,పవన్ కళ్యా ణ్ నేడు ప్రజల శ్రేయస్సును పూర్తిగా పక్కన పెట్టి నరేంద్ర మోడీకి దాసోహ మై ప్రజల జీవితాలతో చెలగాటమాడటం ప్రజ లు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.రాబో యే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూ టమి ప్రభుత్వంలో కొనసాగుతున్న జనసేన,టి డిపి అధికారాన్ని కూల్చడానికి ప్రజలు కార్మికు లు,కర్షకులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించా రు.ఇప్పటికైనా పెరిగిన ధరలను రాష్ట్ర ప్రభు త్వమే భరించాలని లేదంటే ఆటో కార్మికుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్ర మంలో ఆటో కార్మిక సంఘం న్యూసిటీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఐటీసీ శ్రీను మధు,ఆ నంద్,నాయకులు సుందరయ్య స్టాండ్ శ్రీను, నాగరాజు,రాజా,భాష,అమర్నాథ్ మద్దీస్ రా జు,సతీష్,వనుములయ్య,రాజు,హుస్సేన్,జ మ్మన్న,శంకర్,ఎల్లప్ప,నరేష్,లడ్డు,ప్రసన్న,శీను, పెద్దసంఖ్యలో ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.
Comments
Post a Comment