కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్,డీజి ల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలి...ధర్నా చౌక్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు సిఐటియు భారీ ర్యాలీ...
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలి
ధర్నా చౌక్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు సిఐటియు భారీ ర్యాలీ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్,డీజి ల్ వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ సిఐటియు న్యూసిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆ టో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బి.రా ధాకృష్ణ అధ్యక్షతన ధర్నా చౌక్ నుండి కార్మికు లు,ప్రజలు ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యా లయం దగ్గరకు చేరుకొని సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.కార్మికులు డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ చంద్రబాబు నా యుడు రోజురోజుకు ప్రజలపై భారాలు వేస్తు న్న నరేంద్ర మోడీ చంద్రబాబు డౌన్ డౌన్ పెట్రో లు,డీజిల్ వంట క్యాష్ ధరలు తగ్గించే వరకు పోరాడుతాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.అంజిబాబు,సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్.నరసింహులు,సిఐటియు నగర అధ్యక్షులు వై.నగేష్,సిఐటియు జిల్లా నాయకు లు టి.రాముడులు కార్యక్రమానికి విచ్చేసిన కార్మికులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్,డీ జిల్ ధరలను 15రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ధరలు పెంచి ఎనిమిది రూపాయలు ప్ర జలపై మోయలేని భారంవేసింది అన్నారు.గ తంలో విదేశాలలో క్రూడ్ ఆయిల్ ఒక బ్యారల్ ధర 65డాలర్లు ఉన్నప్పుడు తక్కువ ధరకు పెట్రోల్,డీజిల్ అమ్మాలి.కానీ లీటరు పెట్రోల్,డీ జిల్ ధరల ను రూ.110 అధిక ధరకు అమ్మా రు.ఒక లీటరుపై రూ.55 అదనంగా వసూలు చేసి లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొ ల్లగొట్టారు.అదిచాలదు అన్నట్లుగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి.అనే పేరుతో లీటర్ పై ఎనిమిది రూపాయలు పెంచి పేద,మ ధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాలు వే యడం చాలా దుర్మార్గం అన్నారు.గతంలో పె ట్రోల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ ధరలు ఎం దుకు తగ్గించ లేదు.ప్రస్తుతం పెట్రోలు ధరలు పెరిగాయని ఎక్కువ రేట్లకి అమ్మడం ఎంతవ రకు సమంజసం అని అన్నారు.ప్రజలు నరేంద్ర మోడీ చేసే మోసాన్ని గమనిస్తున్నారు.రాబో యే రోజుల్లో నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.కులం,మతం వంటి వా టిని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చే స్తూ తన యొక్క దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకుం టూ మనుగడ సాగించాలని చూస్తున్నారు.ఇ ది ఎంతకాలం కొనసాగదని,తొందరలోనే పత నం తప్పదని మండిపడ్డారు.రాష్ట్రంలోని చంద్ర బాబు నాయుడు కూటమి ప్రభుత్వం కేంద్రం లోని నరేంద్ర మోడీ పెట్రోల్,డీజిల్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారాలు వే స్తుంటే వాటి గురించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒక్క మాటంటే ఒక మాట మాట్లాడడం లేదంటే,వీరికి ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతున్న ట్లు చెప్పారు.మహానాడు మీటింగు మహా సం బరంగా చేసుకున్నామని,ప్రజలకు సంక్షేమ ప తకాలు అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తు న్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు.కానీ మ హానాడు మీటింగ్లో ప్రజల యొక్క స్థితిగతుల గురించిగానీ,ప్రజల ఆర్థిక అంశాల గురించిగా నీ,ప్రజలపై కేంద్రం వేసిన భారాల గురించిగానీ, ఒక్క మాటంటే ఒక్క మాట కూడా ప్రజల గు రించి మహానాడులో మాట్లాడకపోవడం చా లా అన్యాయం అన్నారు.కావున ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వెంటనే స్పందించి ప్రజలపై వేసిన భారాలను తగ్గించి పెంచిన పెట్రోల్,డీజిల్ వంటగ్యాస్ ధరలు త గ్గించే దానికోసం వెంటనే చర్యలు చేపట్టాలని లేకపోతే,రాబోయే రోజుల్లో యువత,ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవు
తారని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐ టియు నగర నాయకులు ఎస్.హుస్సేన్ వలి,జీ.ఏసు,చిన్నమాలిక్,జయన్న,పెద్ద మాలి క్,మల్లి,నాగరాజు,రామకృష్ణ,వెంకట స్వామి, బుజ్జి,విజయ్,శ్యామ్,రైల్వే స్టేషన్ శీను,నూతన పల్లి కృష్ణ,పడదం పాడు శ్రీను,తదితరులు పా ల్గొన్నారు.
Comments
Post a Comment