నగర పౌరుల అరచేతిలో నగరపాలక సేవలు...
ప్రతి ఒక్కరూ పురసేవ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
ఆర్.జి.వి.కృష్ణ,నగరపాలక అదనపు కమిషనర్
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగర పౌరులు అరచేతిలో నగరపాలక సేవలు పొందవచ్చని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నగరాలు,పట్టణాల ప్రజల సౌకర్యార్థం,స్థానిక సమస్యలకు సులువుగా పరిష్కారం పొందేందుకు వీలుగా ‘పురమిత్ర’ యాప్‌ను రూపొందించిందని,నగరపాలకకు సంబంధించిన సమస్త సేవలను కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా,సులువుగా ‘పురమిత్ర’లోనే సకల సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.తాగునీరు, పారిశుద్ధ్యం,వీధి దీపాలు,ఇళ్లలో చెత్త సేకరణ,ఇంటిపన్ను చెల్లింపు,భవన నిర్మాణ అనుమతులు,ఆక్రమణలు,ప్రజారోగ్యం, దోమలు,కుక్కల బెడద,రహదారులపై గుంతలు,జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు,కుళాయిల ఏర్పాటు,పేదరిక నిర్మూలన,వంటి 119రకాల సేవలు పురసేవ యాప్‌లో అందుతాయని వెల్లడించారు.దీనిని ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.టైప్ చేసి లేదా లేదా వాయిస్ రూపంలోనూ పంపేందుకు అవకాశం ఉందని,సమస్యను ఫోటో తీస్తే ఆటోమెటిగ్ గా ఏఐ ద్వారా సంబంధిత చిరునామా అధికారులకు వస్తుందని చెప్పారు.నగరంలో ఇప్పటికే 50వేల మంది పౌరులు పురమిత్ర యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని,మిగిలిన పౌరులు సైతం డౌన్లోడ్ చేసుకోవాలని అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ సూచించారు.
Comments
Post a Comment