ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కాపాడండి...ఆప్టా...
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కాపాడండి...ఆప్టా
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
రాష్ట్రంలో జిఓ 117కు ప్రత్యామ్నంగా తెస్తున్న మార్పులో భాగంగా ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలను 1,2 తరగ తులతో ఏర్పాటు చేసి,అందులో 1:30 ఉపాధ్యాయ,వి ద్యార్ది నిష్పత్తిని ఏర్పాటు చేశారు.రాష్ట్రంలో ఇప్పుడు ఏ ర్పడే అనేక రకాల ప్రాథమిక పాఠశాలలో ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలల సంఖ్య అధి కం.అందులో 20 నుండి 30 మధ్యలో నమోదు కల పాఠశాలల సంఖ్య ఎక్కువ. అందువ లన రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఎక్కువ అయ్యే ప్రమాదం ఏర్పడుతూ ఉంది.తరువాత కాలంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ తో మూతపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గతంలో ఉదాహరణలు చాలా ఉన్నాయి.ఈ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలలో కూడా 1:20 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం పోస్టులు కేటాయింపు జరగాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసి యేషన్ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జి.ఎస్ గణపతి రావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావులు ఆదివారం మానవ వనరులు శాఖ మంత్రి నారా లోకేష్ బాబు,ప్రాథమిక విద్య ప్రిన్సిపల్ సెక్రటరి,డైరెక్టర్ లకు లేఖ రాశారు.అదేవిధంగా మోడల్ ప్రైమరీ పాఠశాల యం దు ప్రధానోపాధ్యాయుడుగా సర్ ప్లస్ గా ఉన్న స్కూల్ అసిస్టెంట్ లను నియమించటం కంటే వారిని ప్రాథమికోన్నత పాఠశాల నియమించి వారి యొక్క విషయ పరిజ్ఞానం వి ద్యార్ధులకు అందించిన ప్రయోజనం ఉంటుందని వారు ప్రాతినిథ్యం చేయటం జరిగింది. ఆదర్శ ప్రాథమిక పాఠశాల లకు ప్రధానోపాధ్యాయుడుగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమో షన్ కల్పించి నియమించాలి అని వారు డిమాండ్ చేశారు.ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసి యేషన్ (ఆప్టా)గా ప్రాథమిక పాఠశాల,విద్యార్ధుల క్షేమం కాంక్షతో ఈ ప్రతిపాదనలు తా ము మొదట నుండి చేస్తూ ఉన్నామని,మంత్రి,అధికారులు తమ యొక్క ప్రతిపాదనలు ఆ మోదించాలని వారు కోరారు.

Comments
Post a Comment