మంగళగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక...అధ్యక్షులుగా వానపల్లి బ్రహ్మనాయుడు...ప్రధాన కార్యదర్శిగా బందెల దయాకర్...
వానపల్లి బ్రహ్మనాయుడు,అధ్యక్షులు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
మంగళగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని గురువారం మధ్యాహ్నం పట్టణంలోని మెయిన్ బజార్ నందు గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా వానపల్లి బ్రహ్మనాయుడు, ప్రధాన కార్యదర్శిగా బందెల దయాకర్, కోశాధికారిగా బత్తుల సాంబశివరావు, గౌరవాధ్యక్షులుగా కూరపాటి మురళి రాజు,ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, మట్టుకొయ్య కృష్ణ,బాపనపల్లి శ్రీనివాసరావులను ఎన్నుకున్నారు.వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వుల శ్రీహరి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.మల్లేశ్వరరావు, కార్యదర్శులుగా దొప్పలపూడి రాము, మెడకాయల మస్తాన్,మంచికలపూడి సిరిబాబు,సహాయకార్యదర్శులుగా చెదలవాడ సాయిచంద్,నాయుడు నాగరాజు,గండికోట దుర్గారావులను ఎన్నుకున్నారు.కార్యవర్గ సభ్యులుగా శిరందాసు విజయ భాస్కర్ ,విడేల సాయి శ్రీనివాస్,కె.అభిరామ్ కృష్ణారెడ్డి, ఎం శివనాగిరెడ్డి,బత్తెన శ్రీనివాసరావు,ఆరేపల్లి రాజు,వేముల రాంబాబు,తిరుమల శెట్టి శ్రీనివాసరావు,మద్దెల కిషోర్,ఉద్దంటి రమేష్, పి.రమేష్ కె.వెంకటేష్,శివరాత్రి శ్రీనివాసరావు, బండారు సాంబ,జీవై సాయి కృష్ణ చిన్ని కాజాలను ఎన్నుకున్నారు.
ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారులు :
కొలికిపూడి రూఫస్,శిరందాసు నాగార్జున, త్రిపురమల్లు సతీష్, ఎన్వి శివన్నారాయణ, గోరంట్ల లక్ష్మీనారాయణ,శిరందాసు శ్రీనివాసరావు,ఈపూరి రాజారత్నం, ఐ.వెంకటేశ్వరరెడ్డి,అన్నవరపు ప్రభాకర్ లను ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి :
మంగళగిరిలో దీర్ఘకాలంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులందరినీ ఏకతాటిపైకి నడిపించి ఐక్యంగా కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వానపల్లి బ్రహ్మనాయుడు,ప్రధాన కార్యదర్శి బందెల దయాకర్ లు తెలిపారు.జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు.ఇందులో ప్రధానంగా ఇళ్ల స్థలాల సాధన, హెల్త్ ఇన్సూరెన్స్,జర్నలిస్ట్ పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ,ప్రమాద బీమా వంటి తదితర ప్రయోజనాలను పొందేందుకు కృషి చేస్తామన్నారు.జర్నలిస్టులు ఇబ్బందుల్లో ఉంటే సహాయం అందించేందుకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు.మరి కొద్ది రోజుల్లో ఐటీ విద్యా శాఖల మంత్రి స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ ను నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఆధ్వర్యంలో జర్నలిస్టులు అందరూ మర్యాద పూర్వకంగా కలవడం జరుగుతుందని వారు తెలిపారు.
Comments
Post a Comment