మత్స్యకారులకు ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం...

పి.జి.వెంకటేష్,తెలుగుదేశం పార్టీ బెస్త సాధికార కమిటి జిల్లా అధ్యక్షులు

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :

రాష్ట్రంలో సంక్షేమ పాలన సూపర్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.కూటమి ప్రభుత్వం వచ్చిన 10నెలల్లోనే ఎన్నికల హామీలు ఒకొక్కటి నెరవేరుస్తూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకునేవిధంగా పింఛన్ల పెంపు నుంచి అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు కొత్తగా మరో పథకానికి శ్రీకారం చుట్టింది.మత్స్యకారులను ఆర్ధికంగా ఆదుకునేలా మత్స్యకారుల సేవలో... పేరుతో సాయం అందించనుంది.ఏప్రిల్, 15వ తేదీ నుంచి జూన్,14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకూడదని ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.నేడు శ్రీకాకుళం జిల్లా,ఎచ్చెర్ల నియోజకవర్గం,బుడగట్లపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారని అయన తెలిపారు.ఈ మేరకు కర్నూలు పట్టణంలోని బిర్లా కాంపౌండ్,కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ బెస్త సాధికార జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం పి.జి.వెంకటేష్ మాట్లాడుతూ 12తీర ప్రాంత జిల్లాల్లో సముద్రం వేటపై జీవిస్తున్న 1,29,178 కుటుంబాలకు ఆర్ధికంగా రూ.258 కోట్ల ప్రయోజనం కలుగుతుంది.కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు,ఆక్వారంగానికి ఎప్పుడూ అండగా ఉంటుందన్న నమ్మకాన్ని ఈ పథకాన్ని తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా నిజం చేసిందన్నారు.

మత్స్యకారులకు ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది :

వేట విరామ సమయంలో గత ప్రభుత్వం ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10,000 మాత్రమే ఇచ్చింది.ఎన్నికల ఏడాదిలో అది కూడా ఇవ్వలేదు.రెండు నెలల పాటు సముద్రంలో వేటకు వెళ్లకుండా,విరామం ఇవ్వడంతో మత్స్యకార కుటుంబాలకు ఆర్ధికంగా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. దీనిని అర్థం చేసుకుని ఎన్నికలకు ముందే మత్స్యకారులకు ఆర్ధిక సాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచుతామని ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టోలో చెప్పింది.నాడు మాట ఇచ్చినట్టుగానే నేడు దానిని నెరవేర్చిందన్నారు.

మత్స్యకారులకు ఆర్ధిక సాయం ప్రవేశ పెట్టింది చంద్రబాబే :

రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు తొలిసారిగా భృతిని ప్రవేశ పెట్టింది. 2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788 కోట్లు ఖర్చు పెట్టింది. అంతేకాకుండా వలలు,పడవలు,ఐస్ బాక్సులు అదనంగా ఇచ్చింది. మత్స్యకారుల పిల్లలకు ప్రత్యేకంగా శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం, పశ్చిమగోదావరి,గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో ఆరు రెసిడెన్షియల్ పాఠశాలు ఏర్పాటు చేసింది.

10 నెలల పాలనలో మరింత సాయం : 

2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆక్వారంగం అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చింది.స్వర్ణాంధ్ర-2047 విజన్‌ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆక్వారంగాన్ని గ్రోత్ ఇంజిన్‌గా ఎంచుకుంది. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు ఇస్తోంది. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తోంది.ఇప్పటికే గతేడాది చనిపోయిన 63మంది మత్స్యకారుల కుటుంబాలకు సాయం అందించింది. మరో 80కుటుంబాలకు త్వరలోనే సాయం చేయనుందని ఈ ఏడాది ఇందుకోసం ఎనిమిది కోట్లు కేటాయించింది.

మత్స్యకారులకు ఇచ్చే డీజిల్‌పై రూ.9 సబ్సిడీ :

వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ ఇస్తోంది.మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3,000 లీటర్లు,మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు డీజిల్‌పై సబ్సిడీ అందిస్తోంది.ఈ ఏడాది అర్హత ఉన్న 23,062 బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు కేటాయించింది.మెకనైజ్డ్ బోట్లపై వేటకు వెళ్తున్న మత్స్య సోదరుల రక్షణ కోసం మూడు నెలల్లో 4,484 బోట్లలో టూ వే కమ్యూనికేషన్ వ్యవస్థ తీసుకురానుంది.సాగర్‌మాల పథకం కింద రూ.97కోట్లతో పులికాట్‌ సరస్సు దగ్గర చేపట్టే ప్రాజెక్టుతో ఆ ప్రాంతంలోని 20 వేల మత్య్సకార కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. 

కొత్తగా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు...ఏడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు :
 
రూ.1,961కోట్లతో కొత్తగా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రెండు దశల్లో రాష్ట్రంలో నిర్మిస్తోంది.అలాగే,వీటికి అదనంగా రూ.199 కోట్లతో ఏడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా సిద్ధం చేస్తోంది.మత్స్యకార కుటుంబాలకు ఉపకరించేలా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఆక్వాపార్క్‌ను రూ.88 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.ఆక్వాకల్చర్‌కు యూనిట్ విద్యుత్‌కు రూ.1.50 కే సరఫరా చేస్తోంది. 68,134 సర్వీస్ కనెక్షన్లకు రూ.1,187 కోట్లు ఖర్చు చేస్తోంది.ఇలా ఎన్నో కార్యక్రమాలు మత్స్యకారుల సంక్షేమం కోసం చేపడుతోంది అయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పి.విజయ్ కుమార్,తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు,బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కుమ్మరి రామకృష్ణ,బెస్త సంఘం నాయకులు రంగడు,వెంకటస్వామి,బాలు,వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

Comments