ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ పొందిన విద్యార్థులకు జ్ఞాపిక మేమంటతో సత్కారం... తూర్పాటి మనోహర్,బేడా బుడగ జంగం సంఘం రాష్ట్ర అధ్యక్షులు...
VS9TV న్యూస్,కర్నూలు :
కర్నూలు నగరం,ఆటో నగర్,నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్వగృహం వద్ద గురువారం ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ పొందిన బేడా బుడగ జంగంకు చెందిన విద్యార్థులు హరిప్రియ, సాయిభావన,సాయి వరుణ్ లను జ్ఞాపిక మేమంటోతో సత్కారం కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన బేడ బుడగ జంగం కుల సమగ్ర నివేదిక కేంద్రానికి పంపడం జరిగిందని అన్నారు.కేంద్ర మంత్రుల ద్వారా సంప్రదించి పక్రియను పూర్తి చేయాలని నంద్యాల ఎంపీని కోరారు.నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ బేడా బుడగ జంగాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు వీలైనంత త్వరగా పరిష్కరించాలని చూస్తున్నారని చెప్పారు.తాము కూడా కేంద్ర మంత్రుల ద్వారా సంప్రదించి వీళ్ళు ఎంత త్వరగా ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు, యువత,కుల నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment