ప్రభుత్వ విద్య రంగాన్ని కాపాడుకుందాం... ఎస్ఎఫ్ఐ...
కర్నూలు జిల్లాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పాటిష్టపరచాలని ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ అన్నారు. శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కర్నూలు జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రస్తుత విద్యలో శాస్త్రీయత ఉండట్లేదని అందుకరణం చేత విద్యార్థులు ప్రపంచ ఙ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం లేదన్నారు.ముఖ్యంగా దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత పాఠ్యపుస్తకాల్లో మతోన్మాద విధానాలను చొప్పించి,సమాజంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు కల్పితమైన అశాస్త్రీయమైన పాఠ్యాంశాలను విధించటం వల్ల మతోన్మాదం పాఠశాల స్థాయి నుండే పెరిగిపోతుందన్నారు.ఈ మతోన్మాద విధానాలను వ్యతిరేకించకుండా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వీటిని సాగిస్తూ విద్యార్థుల మధ్య మతం,కులం అంటూ చిచ్చులు పెట్టటం సరైన వైఖరి కాదన్నారు. ఇప్పటికైన కూటమి ప్రభుత్వం హక్కులను కాలరాసే ప్రయత్నాలు మానుకొని శాస్త్రీయమైన నాణ్యమైన అందించాలని అన్నారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్యాస్థాయి వరకు విద్యార్థులు అనేక సమస్యలు నెలకొన్నాయి. కనిసం ఇప్పటికైన శాఖ అధికారులు మంత్రి స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా, రంగప్ప జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్, జిల్లా సహాయ కార్యదర్శి సంయుక్త, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment