క్రమ శిక్షణతో మెలగాలి...
క్రమశిక్షణతో మెలగాలిచట్టాల గురించి తెలుసుకోవాలిసాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలిట్రైనీ కానిస్టేబుల్స్ కు దిశా నిర్దేశంజిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి నూతనంగా ఎంపికై,శిక్షణ నిమిత్తం కర్నూలు జిల్లా పో లీసు శిక్షణ కేంద్రంకు (డిటిసి) విచ్చేసిన 205 మంది ఎపిఎస్పీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం దిశా నిర్దేశం చేశారు.క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంను జిల్లా ఎస్పీ పరిశీలించారు.కర్నూలు అమి లియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎపిఎస్పీ ట్రైనీ పోలీసులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వ హించారు.ముందుజాగ్రత్తలతో టిటి ఇంజెక్షన్ లు వేయించారు.ఈ సందర్భంగా జిల్లా ఎ స్పీ విక్రాంత్ పాటిల్ ట్రైనీ కానిస్టేబుల్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు.శిక్షణ సమ యంలో క్రమశిక్షణతో మెలగాలన్నారు.కొత్త కొత్త నేరాలకు అనుగుణంగా పోలీసులు మరింతగా సాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు.సమన్వయంతో,మానవతా దృక్పథంతో పని చేసి,సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలన్నారు.చట్టాల గురిం చి తెలుసుకోవాలన్నారు.శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే ఆ రాష్ట్రం బాగుండి అభివృ ద్ది చెందుతుందనివ సిఎం తెలిపారన్నారు.కానిస్టేబుళ్ళు క్షేత్రస్థాయిలో ప్రజలకు నిత్యం అం దుబాటులో ఉంటారన్నారు.
తొమ్మిది నెలల పాటు శిక్షణలో ఔట్ డోర్,ఇండోర్ శిక్షణతో పాటు టెక్నాలజీ,కమ్యూనికే షన్ స్కిల్స్,ఆయుధాల వినియోగం పట్ల శిక్షణ ఇస్తామన్నారు.మారుతున్న నేరాలకు అను గుణంగా పోలీసు ఉన్నతాధికారులు శిక్షణలో మార్పులు చేసారని,వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.శిక్షణలో పొందిపర్చిన ప్రతీ అంశం కూడా మిమ్ములను వృత్తిపరంగా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే అని గ్రహించాలన్నారు.ప్రజల భద్రత,శాంతిభద్రతల పరి రక్షణ కోసం అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్ర మంలో అడిష నల్ ఎస్పీ అడ్మిన్,డిటిసి ప్రిన్సిపాల్ హుస్సేన్ పీరా,కర్నూలు డిఎస్పీ బాబుప్రసాద్,కర్నూ లు డిటిసి డిఎ స్పీ,వైస్ ప్రిన్సిపాల్ దుర్గప్రసాద్,పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, సిఐలు,ఆర్ఐలు,ఎస్సెలు,ఆర్ ఎస్సైలు,ఇతర సిబ్బంది,అమీలియా హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment