విశాఖలో జరిగే సిఐటియు ఆల్ ఇండియా 18వమహాసభల జయప్రదం కోసం రెడ్ షర్ట్ కార్మికుల కవాతు...

విశాఖలో జరిగే సిఐటియు ఆల్ ఇండియా 18వమహాసభల జయప్రదం కోసం రెడ్ షర్ట్ కార్మికుల కవాతు

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
సిఐటియు ఆల్ ఇండియా 18వ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ కర్నూలు ఓల్డ్ సిటీ (సిఐటియు) అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన సోమవారం కర్నూలు ఓల్డ్ సిటీ జమ్మిచెట్టు నుండి వన్ టౌన్ మండిబజార్,పెద్ద పార్కుల మీదుగా వందల మంది కా ర్మికులు ఎర్రని అంగీలు ధరించి కవాతు చేస్తూ సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు జ యప్రదం చేయండి అని ప్రచారం చేస్తూ జిల్లా పరిషత్,గాంధీ విగ్రహం వరకు వెళ్లడం జ రిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ,శ్రామిక మ హిళ రాష్ట్ర కన్వీనర్ నిర్మలమ్మ,సిఐటియు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి విజయ రామాంజ నేయులు,సిఐటియు నగర ఉపాధ్యక్షులు రాజశేఖర్ సివిల్ సప్లై రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణ మాట్లాడుతూ బ్రిటిష్ వాడు కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను చ ట్టాలను ఈ దేశ అభివృద్ధి కోసం పని చేస్తామని దేశ ప్రజలను కార్మికులను మో సం చేసి అధికారంలోకి వచ్చిన బిజెపి వారి అనుబంధ ప్రభుత్వాలు కార్మికులను మోసం చేస్తూ కా ర్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక కోట్ల నమోదు చేయడం దుర్మార్గమన్నారు.ప్రపంచవ్యా ప్తంగా ఎనిమిది గంటల పని విధానం అమలు జరుగుతుండగా అభివృద్ధి పేరుతో కార్మికు ల రక్తాన్ని తాగమరిగిన కార్పొరేట్ పెట్టుబడిదారుల తొత్తులు 13 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు,మన రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రం విశాఖ మ హానగరంలో మొట్టమొదటిగా జరుగుతున్న సిఐటియు ఆల్ ఇండియా మహాసభలను జ యప్రదం చేయాలని అన్నారు,ఇప్పటికే కార్మికుల పరిస్థితి ఇ బ్బందికరమైన పరిస్థితుల్లో ఉందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలలో రద్దు చేస్తూ కార్మిక కోడ్లను అమ లు చేస్తున్నామని,ఈ సంవత్సరం నవంబర్ 21వ తేదీ నుండి కార్మిక కోడ్లు అమలు చే యడం వలన కార్మికులు బానిసలుగా మారే పరిస్థితి ఏర్పడిందని వారు బాధ వ్యక్తం చేశా రు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి కార్మికుల కష్టార్జితం ద్వారా ఏ ర్పడిన ప్రభుత్వ సంస్థ లను ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా అమ్మడం లేదా మూసేయడం జరుగుతుందని విమర్శించారు.బిఎస్ఎన్ఎల్,ఎల్ఐసి ఇన్సూరెన్స్,రోడ్లు,ఎయిర్ ఇండి యా,తపాలా,రైల్వే చాలా ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయడం జరుగుతున్నందున కా ర్మికులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారని తెలిపారు.విశాఖ నగరంలో పెద్దఎత్తున అభివృద్ధి అయిందంటే విశాఖ ఉక్కు ద్వారానే అనే నిజాన్ని మర్చి పోయిన పాల కులు కార్పొరేట్ల మోజులో ఉండి నమ్మి ఓట్లు వేసినా కార్మికులను ప్రజలను లెక్క చేయకుండా ప్రత్యేక హోదా విభజన హామీలు అడగలేక ప్రాణత్యాగాల ద్వారా ఏర్ప డిన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడమా? మూసి వేయడమా అనే దుర్మార్గమైన ఆ లోచనతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాటా ఆడుతున్నాయని విమర్శించారు.ఇలాంటి తరుణంలో మన రాష్ట్రంలోని విశాఖ నగరంలో డిసెంబర్,31 నుండి జనవరి,4వ తారీఖు వర కు జరుగుతున్న సిఐటియు అఖిలభారత మహాసభలకు లక్షలాదిమంది అసంఘటిత కార్మికులు స్కీం వర్కర్లు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్లు ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని నాలుగో తారీఖున జరిగే బహిరంగ సభను పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చా రు.ఈ కార్యక్రమంలో మహమూద్,ఖాజాబాషా,నాగస్వాములు,నాగరా జు,సోలామన్ రా జు,కుమార్,కేవీపీఎస్ నగర అధ్యక్షులు రమణ,కృష్ణ,ఆవాజ్ నాయకులు షరీఫ్ మాభాష, ఖలీల్,సిఐటియు నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

Comments