తల్లి జన్మనిస్తే...హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది...ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్...హెల్మెట్ దరిద్దాం...ప్రాణాలు కాపాడుకుందాం...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)
తల్లి జన్మనిస్తే...హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది
తల్లి,తండ్రులు తమ పిల్లలు వాహనాలపై చేస్తున్న వ్యవహారం గమనించండి
ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్చిన్న నిర్లక్ష్యం...నిండు ప్రాణాలు బలిహెల్మెట్ దరిద్దాం...ప్రాణాలు కాపాడుకుందాంప్రభుత్వ వ్యవస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారునో హెల్మెట్...నో ఎంట్రీ పాటించాలి దండు విద్యాసాగర్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులునీలం సత్యనారాయణ,వ్యవస్థాపక అధ్యక్షులునో హెల్మెట్...నో పెట్రోల్ పై భారీ అవగాహన బైక్ ర్యాలీ
తల్లి జన్మనిస్తే...హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది.చిన్న నిర్లక్ష్యం...నిండు ప్రాణాలు బలి.హెల్మెట్ దరిద్దాం...ప్రాణాలు కాపాడుకుందాం అని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్,వ్యవస్థాపక అధ్యక్షులు నీలం స త్యనారాయణలు కర్నూలు ప్రజలకు హితవు పలికారు.ఈ మేరకు ఆదివారం కర్నూలు ట్రా ఫిక్ సిఐ మన్సూరుద్దీన్ సహకారంతో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ఆధ్వర్యం లో నో హెల్మెట్...నో పెట్రోల్ పై అవగాహన కల్పిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కొత్తపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని ట్రాఫిక్ సీఐ మ న్సూరుద్దీన్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడు తూ 2025 సంవత్సరంలో కర్నూలు నగరంలోనే 42 మంది,జిల్లా వ్యాప్తంగా సుమారు 280 మంది రహదారి ప్రమాదాల్లో మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన చెం దారు.ఈ మరణాల్లో అత్యధికులు హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని, ఈ నేపథ్యంలో డిసెంబర్,30వ తేదీ నుండి అమలు కానున్న "నో హెల్మెట్-నో పెట్రోల్" విధానానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం,ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసు లకు మద్దతుగా ఈ ర్యాలీ చేపట్టినట్లు చెప్పారు.మరోవైపు నగరంలో జరుగుతున్న ప్రమా దాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను దగ్గరగా చూడడం జరుగుతుంది అన్నారు.ఈ నేపథ్యంలో వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం అని భావోద్వేగం చెం దారు.కావున భవిష్యత్ లో ప్రాణా లు కోల్పోకూడదు అనే భావనతో సామాజిక బాధ్యత గా ప్రజలను చైతన్యం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రతి ఒక్క రూ హెల్మెట్ ధరించడం వల్ల తమ కుటుంబాలకు అండగా ఉండవచ్చని,ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా విధిగా హెల్మెట్ ధరించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ మాట్లాడుతూ నిర్లక్ష్యం వీడి హెల్మెట్ ధరించడం వల్ల పునర్జన్మ పొందుతారని,"అమ్మ జన్మనిస్తే...హెల్మె ట్ పునర్జన్మనిస్తుంది" అనే స్ఫూర్తితో ప్రతి వాహనదారుడు బాధ్యతగా మెలగాలని పిలు పునిచ్చారు.కాకి పిల్ల కాకికి ముద్దు అనేవిధంగా మన ఆలోచన కరెక్ట్.కానీ వాహనాలపై మన పిల్లలు చేస్తున్న వ్యవహారాలు గమనించాల్సిన బాధ్యత గుర్తించండి.వాహనాలపై నేటి యువత స్నేక్ డ్రైవింగ్,రాష్ డ్రైవింగ్,బైక్ రైడింగ్ వంటి వాటితో ఇష్టానుసారంగా వా హనాలు నడుపుతున్నారు.దీంతో ఇతరులకు ఇబ్బందికరంగా మారడమే కాదు.కొన్ని స మయాల్లో దారుణ ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.ఒకరు చేస్తున్న తప్పుకు ఇరువైపుల కుటుంబాలు సైతం నేడు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం అన్నా రు.ఇలాంటి ప్రమాదాలతో జన్మనిచ్చిన తల్లి,తండ్రులు,భార్య,పిల్లలు రోడ్డున పడుతున్నా రు.చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎన్నో కుటుంబాలకు తీరని శోకం మిగిలిస్తున్నారు.కావున మన పిల్లలకు వాహనం పట్ల జాగ్రత్తలు,సూచనలు ఇచ్చే విధంగా ప్రతి తల్లి,తండ్రులు బాధ్యత తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అదేవిదంగా ప్రతి ప్రభుత్వ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి హెల్మెట్ ధరించాలి.వారికీ కూడా ఇదే విధానం అనుసరించేలా "నో హెల్మెట్-నో ఎంట్రీ" అనే విధానం పాటించా ల్సిన బాధ్యతను జిల్లా ఉన్నతాధికారులు ప్రతి శాఖకు అందచేయాల్సిన బాధ్యత తీసుకో వాలని ఆయన సూచించారు.
ఈ ర్యాలీ కొత్తపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై కొండారెడ్డి బురుజు,కిడ్స్ వ రల్డ్,రాజవిహార్,జిల్లా కలెక్టరేట్ మీదుగా గాయత్రిఎస్టేట్,సి.క్యాంప్,బిర్లాకాంపౌండ్,మెడి కల్ కళాశాల,మౌర్యఇన్,కొత్తబస్టాండ్,బళ్లారి చౌరస్తా,చివరగా రాజవిహార్ సర్కిల్ వద్ద ముగిసింది.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ హుస్సేన్ భాష,ట్రాఫిక్ సిబ్బంది,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)జిల్లా సహయ కార్యదర్శి రాజశేఖర్,వ్యవస్థాపక సభ్యులు ప రమేష్,వడ్డేమాన్ విజయ్ కుమార్,గిలిగిత్త విజయ్ కుమార్,వై.వి.రెడ్డి,నగరఅధ్యక్షులు నా గేంద్ర,కల్లూరు మండలం అధ్యక్ష,కార్యదర్శులు లోకేష్,మధుసూదన్,ప్రతినిధులు మధు, లోకేష్,కిషోర్,వారణాసిప్రసాద్,ఆజాద్,దనేష్,మధుబాబు,లక్ష్మీనారాయణ,దామోదరసంజీవయ్య,మల్లి,జయబాబు,శేఖర్,తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment