హైదరాబాద్ శాంతిభద్రతలు ప్రశ్నార్థకం !...

హైదరాబాద్ శాంతిభద్రతలు ప్రశ్నార్థకం !
VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్‌లో గత వారం రోజుల్లో నగ రంలో ఐదు సంచలన హత్యలు జరిగా యి.ఇద్దరు రియల్టర్ల హత్యలు,ఒక యువతి గొంతు కోసిన దారుణం చోటు చేసుకున్నాయి.కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరంలో సంచలనాత్మక నేరాలు జరుగుతూనే ఉంటాయి.ఆవేశంలో జరిగే నేరాలను పోలీసులు కూడా అడ్డుకోలే కపోవచ్చు కానీ పాత నేరస్తులు ప్లాన్ చేసి మ రీ హత్యలకు పాల్పడుతూంటే..ఆపలేకపో వడం మాత్రం పోలీసుల వైఫల్యం అవుతుంది.

వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువ హత్యలు :

ఇటీవలి హత్యలన్నీ వ్యక్తిగత శత్రుత్వా లు,ప్రేమ వైరాలు,ఆస్తి వివాదాలతో ముడిపడి ఉంటున్నాయి.డిసెంబర్,11న ముషీరాబాద్‌లో 17ఏళ్ల పవిత్రను కత్తితో పొడిచి చంపిన యువకుడు ఆమెకు దగ్గ రి బంధువే.డిసెంబర్,3న యాకుత్‌ పురలో రియల్టర్ జునైద్‌ను హత్య చేసిన వారు ఆస్తి వివాదంలో ఉన్న కుటుంబ స భ్యులే.ఈ రకమైన పరిచయస్తుల చేతు ల్లోనే ఎక్కువ మంది హతమవుతున్నా రు.వ్యాపార వివాదాలతో మరికొంత మంది శత్రువుల్ని చంపడానికి వెనుకా డటం లేదు.

పాతికేళ్ల పగతో రియల్టర్ హత్య :

తన తండ్రి ఎన్ కౌంటర్ కు...ఓ వ్యక్తి కారణం అని అతని కొడుకు గుర్తుంచు కుని పాతికేళ్ల తర్వాత ఆ వ్యక్తిని చంపే శాడు.ఈ వ్యవహారం సంచలనం అయిం ది.ఇలాంటి ప్లాన్డ్ మర్డర్స్ విషయంలో పోలీసులు చురుగా ఉండలేకపోతున్నా రు.పాతనేరస్తులపై నిఘా తగ్గిపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నా యన్న ఆరోపణలు వస్తున్నాయి.

వేగంగా స్పందిస్తున్న పోలీసులు :

సంచలన హత్య కేసుల్లో పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు.48గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుంటు న్నారు.సీసీటీవీ ఫుటేజ్,మొబైల్ టవర్ డంప్ డేటా,డిజిటల్ ఎవిడెన్స్‌తో కేసులు వేగంగా ఛేదిస్తున్నారు.కానీ నేరంగా జరిగి పోయిన తర్వాత చర్యలు తీసుకోవడం కన్నా..నేరం చేయాలంటేనే నేరస్తులు భ యపడేలా చేయాల్సి ఉంటుంది.అప్పుడే క్రైమ్ రేట్ పెరుగుతుంది.యథేచ్చగా ప్రతీ కారాలు తీర్చుకునే పరిస్థితి ఉందని అను కుంటే నేరమనస్థత్వం ఉన్న వారికి ధైర్యం వస్తుంది.రియల్ ఎస్టేట్ వివాదాల్లో రౌడీషీ టర్ల పాల్గొనడం,మహిళలపై లైంగిక నేరా లు,పిల్లలపై పోక్సో కేసులు ఇంకా ఆందో ళన కలిగిస్తున్నాయి.భూమి గొడవల్లో రాజకీయ నాయకుల కుటుంబాల ప్రమే యం,ఆ తర్వాత పోలీసు బదిలీలు ఇవ న్నీ ప్రజల్లో అపనమ్మకం కలిగిస్తున్నాయి. పోలీసులు శాంతిభద్రతల అంశంలో మ రింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంద న్న అభిప్రాయం సామాన్య ప్రజల నుంచి వస్తోంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...