సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో...ఏపీ సీఎం చంద్రబాబు...

సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో
ఏపీ సీఎం చంద్రబాబు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.ఈ మేరకు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ)పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు.పారదర్శక పాలన అందించడంతో పాటు,ప్రభుత్వ పని తీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే అవసరం లేకుండా అన్ని సేవలను అందించాలని సీఎం నిర్దేశించారు.ఇందు కు 'మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్'ను సమర్థంగా వినియోగించుకోవాలని,దీని పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించా లని సూచించారు.ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని, అవి వెంటనే తమ పద్ధతి మార్చుకుని ఆన్‌లైన్‌ బాట పట్టాలని చంద్రబాబు అ న్నారు.రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెం ట్లను కొరియర్ ద్వారా నేరుగా లబ్ధిదా రుల ఇళ్లకే పంపాలని సూచించారు. ఆర్టీసీ బస్టాండ్ లు,ముఖ్యంగా టాయి లెట్ల వద్ద పరిశుభ్రతకు పెద్దపీట వేయాల ని,ప్రయాణికులకు మెరుగైన సేవలు అం దించాలని ఆదేశించారు.భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరుగు తుందని,వాటి సేవలను మరింత విస్తృ తం చేసేందుకు ఒక మాస్టర్ ప్లాన్ రూపొం దించాలని చెప్పారు.పురుగు మందుల వాడకాన్ని తగ్గించేందుకు డ్రోన్లను ఎలా ఉపయోగించవచ్చో రైతులకు అవగాహ న కల్పించాలని తెలియచేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...