భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనున్న భారత్...కేంద్రం గ్రీన్ సిగ్నల్...

భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనున్న భారత్
కేంద్రం గ్రీన్ సిగ్నల్

VS9TV న్యూస్,హైదరాబాద్ :
త్రివిధ దళాలకు సంబంధించిన సుమారు రూ.79వేల కోట్ల విలువైన ఆయుధాలు,పరిక రాల కొనుగోలు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ సముపార్జన మండలి (డీఏసీ) సమావేశంలో ఈ మే రకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ ఒప్పందం ప్రకారం సైన్యానికి పలు కీలక ఆయుధ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి.శత్రుల క్ష్యాలపై అత్యంత కచ్చితమైన దాడులు చే యగల యిటర్ మునిషన్ వ్యవస్థను సైన్యం పొంద నుంది.అలాగే తక్కువ ఎత్తులో,చి న్న పరిమాణంలో ప్రయాణించే శత్రుడ్రోన్‌లు,యూఏవీలను గుర్తించి ట్రాక్ చేసే తేలికపా టిలో లెవల్ రాడార్లను కూడా సమకూర్చనున్నారు.దీంతో యాంటీ-డ్రోన్ రక్షణ మరింత బలపడనుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.నేవీకి సంబంధించన ప్రతిపాదనలకూ డీఏసీ ఆమోదం తెలిపింది.ఈ ఒప్పందం కింద బొల్లార్డ్ పుల్ (బీపీ) టగ్‌లను నేవీకి అం దించనున్నారు.ఇవి ఓ డరేవుల్లో నావిగేషన్ సమయంలో,పరిమిత ప్రదేశాల్లో నౌకలు, జ లాంతర్గాములను సురక్షి తంగా నడిపించేందుకు సహాయపడతాయి.అదేవిధంగా హై-ఫ్రీక్వెన్సీ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియో (హెచ్ఎఫ్ ఎస్‌డీఆర్) ద్వారా బోర్డింగ్,ల్యాండింగ్ కార్య కలాపాల సమయంలో సురక్షి తమైన,దీర్ఘశ్రేణి కమ్యూనికేషన్ సామర్థ్యం మరింత మెరు గుపడనుంది.వైమానిక దళానికి ఈ ఒప్పందం ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చ నుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో టేకాఫ్,ల్యాండింగ్‌లను హై-డెఫినిషన్‌లో రికార్డ్ చేసే ఆటో మేటిక్ టేకాఫ్,ల్యాండింగ్ రికార్డింగ్ వ్యవస్థను వైమానిక దళం పొందనుంది.దీంతో వి మాన భద్రత మరింత బలపడనుంది.అలాగే సుదూర శ్రేణిలో శత్రు విమానాలను గగనత లంలోనే కూల్చివేయగల ఆస్ట్రా ఎంకె -2 క్షిపణిని కూడా వైమానిక దళంలోకి చేర్చనున్నా రు.అదనంగా స్పైస్ (ఎస్‌పైసీఇ-1000) మార్గదర్శక కిట్‌ను అందించడంతో లక్ష్యాలపై ఖచ్చితమైన దాడుల సామర్థ్యం పెరుగుతుందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...