దైర్యంగా దొంగను పట్టుకున్న యువతి...

దైర్యంగా దొంగను పట్టుకున్న యువతి

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
కేరళ,అలప్పుజకు చెందిన దివ్య అనే బాలిక ఢిల్లీలోని కేరళ స్కూల్‌లో 9వ తరగతి చదు వుతోంది.రాత్రి సమయంలో ట్యూషన్ ముగించుకుని తన తల్లితో కలిసి ఇంటికి వెళ్తుం డగా,ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి ఆమె తల్లిని కిందకు తోసేసి,మెడలోని గొలుసును లా క్కొని పారిపోయాడు.తల్లి కింద పడిపోవడాన్ని చూసిన దివ్య ఏమాత్రం భయపడ కుం డా దొంగను వెంబడించింది.
రద్దీగా ఉన్న రోడ్డుపై దాదాపు అర కిలోమీటరు దూరం పరుగెత్తి అతడిని దైర్యంగా పట్టు కుంది.గత ఐదేళ్లుగా కరాటే నేర్చుకుంటున్న దివ్య,తన నైపుణ్యంతో దొంగను లొంగదీసి కిందకు పడవేసింది.అనంతరం స్థానికుల సహాయంతో అతడిని పోలీసులకు అప్పగిం చారు.గొలుసు కంటే కూడా,మా అమ్మను కిందకు తోసేయడం చూసినప్పుడు నాకు కలి గిన ఆగ్రహమే నన్ను అతడిని పట్టుకునేలా చేసింది అని దివ్య పేర్కొంది.ఆపత్కాలంలో అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య ఎంత అవసరమో ఈ సంఘటన మరోసారి నిరూపిం చింది.దివ్య చూపిన సాహసాన్ని కచ్చితంగా అభినందించాలి.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...