బెల్ట్‌షాపులపై భగ్గుమన్న మహిళలు... అక్రమంగా దాచిన మద్యం సీసాలను వీధిలోకి తీసుకొచ్చి దహనం...ఇకపై మద్యం అమ్మితే ‘ఖబడ్దార్‌’ అంటూ హెచ్చరిక...

బెల్ట్‌షాపులపై భగ్గుమన్న మహిళలు
అక్రమంగా దాచిన మద్యం సీసాలను వీధిలోకి తీసుకొచ్చి దహనం
ఇకపై మద్యం అమ్మితే ‘ఖబడ్దార్‌’ అంటూ హెచ్చరిక
VS9TV న్యూస్,బాపట్ల :
బాపట్ల జిల్లా,పంగులూరులో బెల్ట్‌ షాపు లకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమిం చారు.ర్యాలీగా వెళ్లి బాపట్ల జిల్లా, పంగు లూరు మండలం,కోటపాడు గ్రామంలోని బెల్ట్‌ షాపులపై దాడి చేశారు.అక్రమంగా దాచిన మద్యం సీసాలను బయటకు తీసుకొచ్చి వీధిలో తగలబెట్టారు.ఇకనుం చి మద్యం అమ్మితే ఊరుకునేది లేదని నిర్వాహకులను హెచ్చరిక చేశారు.మ ద్యం వల్ల మా కుటుంబాలు నాశనమ వుతున్నాయని,కుటుంబాల్లో కలహాలు చెలరేగి భార్యాభర్తలు విడిపోతున్నారని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆ వేదన వ్యక్తం చేశారు.ఎవరైనా బెల్ట్‌ షాపు లు నిర్వహిస్తే తమ తడాఖా చూపిస్తా మని మహిళలు హెచ్చరించారు.వీరికి గ్రామస్తులంతా వీధిలోకి వచ్చి మద్దతు తెలిపారు.మద్యం షాపులను నిర్వాహకు లను కట్టడి చేయండి అంటూ ప్రోత్సహిం చారు.ఈ నేపథ్యంలో ఐద్వా అఖిల భారత నాయకు రాలు డి.రమాదేవి ఆధ్వ ర్యంలో కోటపాడు గ్రామంలోని దళిత కాలనీలో మహిళలతో సమావేశ మయ్యా రు.ఈ సందర్భంగా మహిళలు మాట్లా డుతూ మా గ్రామంలో ఏడు బెల్ట్‌ షాపులు నడుస్తున్నాయని,మద్యం వల్ల మా కుటుంబాలు సర్వనాశనమవు తున్నాయని తెలిపారు.మా గ్రామంలో మద్యం అమ్మడానికి వీల్లేదని, ఇందు కోసం ఏ పోరాటానికైనా సిద్ధమేనని చెప్పారు.అనంతరం మహిళలంతా బెల్ట్‌ షాపులపై దాడికి కదిలారు.తొలుత దళిత కాలనీ పక్కనే ఉన్న బత్తుల కొండలు బెల్ట్‌ షాపుపై దాడి చేశారు.మద్యం సీసాల కోసం వెతికారు.ముందుగానే సమాచారం అందుకున్న కొండలు వాటిని వేరేచోటకు పంపాడని తెలుసుకొని మహిళలు అక్క డి నుండి ఇరగని గోవిందమ్మ బెల్ట్‌ షాపు వద్దకు వెళ్లారు.ఆమెతో మాట్లాడారు. పంగులూరు,ముప్పవరం బ్రాందీ షాపుల నుండి మద్యం బాటిళ్లు తీసుకొస్తున్నా నని,రోజుకు పది క్వార్టర్ల మద్యం అమ్ము తున్నానని,రూ.400 ఆదాయం వస్తోం దని గోవిందరమ్మ చెప్పారు.ఇక నుండి మద్యం అమ్మితే ఊరుకోబోమని మహిళ లు హెచ్చరించారు.ఆ తర్వాత గ్రంధి రామారావు,గ్రంధి మహాలక్ష్మి బెల్ట్‌ షాపు లపై దాడి చేశారు.ఈ సందర్భంగా బెల్ట్‌ షాపు నిర్వాహకులకు,వారికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.మహిళలు వారి ఇంట్లోకి వెళ్లి దాచిపెట్టిన మద్యం సీసాలను,గ్లాసులను,కాళీ మద్యం సీసా లను బయటకు తీసుకొచ్చి దగ్ధం చేశా రు.ఈ సందర్భంగా రమాదేవి మాట్లా డుతూ మద్యం వల్ల అనేక కుటుంబాలు సర్వనాశనమవుతున్నా ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని మద్యం అమ్మకా లను ప్రోత్సహిస్తోందని,మద్యం షాపుల్లో ఎమ్మెల్యేలకు కూడా వాటాలు ఉన్నాయ ని అన్నారు.రోజంతా కష్టపడి సంపాదిం చిన డబ్బులను కొందరు మద్యానికి ఖర్చు పెడుతున్నారని,అటువంటి వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నా యని తెలిపారు.గంజాయిని నిలువరిం చేందుకు నెల్లూరు జిల్లాలో పోరాడుతున్న పెంచలయ్యను గంజాయి ముఠా దారు ణంగా హత్య చేసిందని,దానిపై ఇంతవ రకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకో లేదని అన్నారు.మద్యానికి,బెల్ట్‌ షాపు లకు వ్యతిరేకంగా మహిళలంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.సిపిఎం మండ ల కార్యదర్శి తలపనేని రామారావు, సభ్యుడు గుడిపాటి మల్లారెడ్డి మాట్లా డుతూ గతంలో ఇక్కడ బెల్ట్‌ షాపులకు వ్యతిరేకంగా మహిళలు పోరాడారని, మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.అనంతరం మహిళలు ‘బెల్ట్‌ షాపులను నివారించాలి,బెల్టు షాప్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి, మా ఊరికి మద్యం వద్దు,గంజాయి గుండాల దాడికి బలైన పెంచలయ్యకు జోహార్‌’ అంటూ నినాదాలు చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...