క్యాలెండర్ అంటే పేజీలు తిరిగేయటం కాదు... మెప్మా ఆర్పీ - 2026 క్యాలెండర్ ఆవిష్కరణ లో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతి...
క్యాలెండర్ అంటే పేజీలు తిరిగేయటం కాదుగడచిన కాలం బేరిజ్ వేసుకొని భవిష్య త్తు ప్రణాళిక వేసుకోవటమేమెప్మా ఆర్పీ - 2026 క్యాలెండర్ ఆవిష్కరణలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతి
మెప్మా ఆర్పీల సంఘం కార్యదర్శి ఉమాదేవి అధ్యక్షతన నూతన - 2026 క్యాలెండర్ ఇం డియన్ బ్యాంక్ మేనేజర్ శృతి,సామాజిక ఉద్యమ కార్యకర్త అర్జ ఉష,శ్రామిక మహిళా సం ఘం జిల్లా కన్వీనర్ నిర్మల,స్థానిక లక్ష్మీనగర్ వికాస్ స్కూల్లో ఆదివారం అవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా మేనేజర్ శృతి మాట్లాడుతూ క్యాలెండర్ అంటే తేదీలు చూసి పే జీలు చెప్పటం కాదు.జరిగిన కాలంలో మనం ఏం చేశాం.ఏం చేయలేకపోయాం.భవి ష్యత్తులో ఏం చేయాలి అని ప్రణాళిక వేసుకోనీ కృషి ఫలితం వచ్చేది క్యాలెండర్ ఆవిష్కర ణ కూడ అదే అని హితవు పలికారు.ఆర్పీల సంఘం క్యాలెండర్ ను తీసుకురావడం అది కూడా ప్రయోజనకరంగా ఉండే విధంగా సావిత్రిబాయి పూలే,కెప్టెన్ లక్ష్మీషేగళ్,రాణి రుద్ర మదేవి,ఝాన్సీలక్ష్మిబాయి,మదర్ తెరిసా,సరోజినీనాయుడు,మల్లు స్వరాజ్యం,కల్పనా చా వ్లా,చాకలి ఐలమ్మ,ఇందిరాగాంధీ,మలాలా,యూసఫ్ జాయ్ వంటి వీరవనితలు దేశం కోసం సమాజం కోసం కృషి చేసిన వారు.అలాంటి త్యాగమూర్తులను కొనియాడుతూ మన తరాలకు అభివృద్ధి జరగాలని కోరుకోవాలని ఆమె పేర్కొన్నారు.అలాగే ఈ క్యాలెం డర్,ప్రతి పేజీలో పొదుపులో ఉంటూ ఆర్థికంగా ఎదిగిన వారి వ్యాపారం ఫోటోలతో వే యటం.అలాగే ఐక్యత విజయం పోరాటం అనే నినాదాలు చాలా చక్కగా ఉన్నాయని చె ప్పారు.అందుకే మెప్మా అర్పీలను గౌరవించడం చేస్తుంటాను.కారణం మెప్మా విధి విధా నాలను పొదుపు గ్రూపులో సభ్యులు తీసుకెళ్లి వారిని ఆర్థిక,సామాజిక,సాధికారిక అభివృ ద్ధి వైపు తీసుకెళ్లే ఆర్పీలు అంటే నేను చాలా గౌరవిస్తాను.ఎవరికైనా సమస్యలు పరిష్కా రం కావాలంటే ఐక్యత సాధించుకోవాలన్నారు.అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవు తుందని పేర్కొన్నారు.వనం డైరెక్టర్,సామాజిక ఉద్యమ నాయకురాలు అర్జ ఉష మాట్లాడు తూ ముందుచూపుతో ప్రణాళిక వేసుకుని ఆప్రణాళిక ప్రకారం ఆచరించటం అనుగు ణం గా కార్యచరణ చేసుకుంటూ వెళ్ళటమే ముఖ్యం.అంతేకానీ అప్పటికప్పుడు ఇది చేద్దాం. అది చేద్దాం అని వెళ్తూ ఉంటే ప్రయోజనం ఉండదు.శృతి చెప్పినట్లు మీ రు అభివృద్ధి సా ధించి చూపెట్టడమే మనం వేసుకునే ప్రణాళిక అన్నారు.అదేవి దంగా సిఐటియు నాయకు లు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సిఐటి నగర నాయకులు ర ఫీ,మెప్మాఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు పి.రుద్రమ్మ,సుజాత,స్వాతి,బి.జ్యోతి,ధరణి,కై రూన్,ఖాజాబీ,షహనాజ్ ధరణి,శ్రీదత్త ఆర్.పి.సి.మంజుల,అధ్యక్ష,కార్యదర్శులు ఎం.వా ణిశ్రీ,ఊర్మిళ,సిరిఐక్య సంఘం అధ్యక్షురాలు,కోశాధికారి వి.రాధిక,కె.సరిత,చంద్రిక,రేష్మ, అయేషా,భరతమాత ఆర్పి పద్మ,ఓబి వీరమ్మ,పావని,లక్ష్మీదేవి,పెద్దలు భానుప్రసాద్,శ్రీని వాసులు,కన్నా,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment