పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల...
VS9TV న్యూస్,హైదరాబాద్ :
బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి,యాంకర్ శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు శ్యామలను విచారించారు.ఇదిలాఉంటే...తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ ఇటీవల తెలంగాణ హైకోర్టులో శ్యామల పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.విచారణకు సహకరించా లని శ్యామలకు కోర్టు సూచించింది. దీంతో ఆమె పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
Comments
Post a Comment