బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతం...సిఎం చంద్రబాబు...

బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతం... సిఎం చంద్రబాబు...

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిలేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 40నిమిషాల పాటు వీరిద్దరు సమావేశం అయ్యారు.భేటీ అనంతరం బిలేట్స్ తో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు 'ఎక్స్' వేదికగా వెల్లడించారు."బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగింది.ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపాం.ఆరోగ్య సంరక్షణ,విద్య,వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించాం.స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.గేట్స్ ఫౌండేషన్ తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తిమంతం చేయడంతో పాటు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు చంద్ర బాబు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...