సమాజసేవతోనే సంతృప్తి... టీ.జీ.వెంకటేష్,మాజీ రాజ్యసభ సభ్యులు

సమాజసేవతోనే సంతృప్తి

టీ.జీ.వెంకటేష్,మాజీ రాజ్యసభ సభ్యులు 

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : 

సమాజ సేవతోనే సంతృప్తి కలుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు టీ.జీ.వెంకటేష్ అన్నారు.ప్రతి వ్యక్తీ తన సంపాదనలో కొంత శాతం సమాజ సేవకు వినియోగిస్తే దేశం పురోగతి సాధిస్తుందని ఆయన అన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆయత్ ఫౌండేషన్ సేవా సంస్థ లోగోను తన నివాసంలో ఆవిష్కరించిన సందర్బంగా టీ.జీ.వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సమాజాన్ని తన కుటుంబంలా భావించినప్పుడే ప్రగతి ఫలాలు అందుతాయని అన్నారు.పోలీసు శాఖలో విశేష సేవలు అందించిన రిటైర్డ్ డియస్పీ మహబూబ్ బాషా సమాజసేవా రంగంలోకి రావడం అభినందనీయమని అన్నారు.ఆయత్ ఫౌండేషన్ అధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ ఒక మంచి సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో తాము ఈ సంస్థను ప్రారంభించామని అన్నారు.మారుతున్న కాలానికనుగుణంగా రాబోయే తరాల కోసం ఒక వినూత్న ప్రణాళికతో తమ కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఆనందరావు, రామమోహన్ రెడ్డి,వెంకట్రాముడు, నాగేశ్వరబాబు,సూర్యకుమార్, జ్యోతిరాణి,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...