కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలె...ఘనంగా జ్యోతిరావు పూలె 198వ వారోత్సవాలు...

కెవిపిఎస్ నగర కార్యదర్శి భాస్కర్

VS9TV న్యూస్,కల్లూరు :

కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలె అని కెవిపిఎస్ నగర కార్యదర్శి భాస్కర్ పేర్కొన్నారు.శుక్రవారం కర్నూలు అర్బన్, 32వ వార్డ్,ముజఫర్ నగర్ లో వార్డ్ అధ్యక్షులు ఈ రామాంజనేయులు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలె 198వ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కెవిపిఎస్ నగర కార్యదర్శి భాస్కర్,సిఐటియు నగర కార్యదర్శి కె.సుధాకరప్ప,నగర సహాయ కార్యదర్శి ఎం.సి.ఆనంద్ లు హాజరయ్యారు.ఈ సందర్బంగా కెవిపిఎస్ నగర కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ 1873,సెప్టెంబరు 24న పూలే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడన్నారు.సిఐటియు నగర కార్యదర్శి కె.సుధాకరప్ప మాట్లాడుతూ మతాలు,కులాల తారతమ్యం లేకుండా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పని చేశాడని కొనియాడారు.లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడినట్లు చెప్పారు.అతను,అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు అని పేర్కొన్నారు.నగర సహాయ కార్యదర్శి ఎం.సి.ఆనంద్ మాట్లాడుతూ మహిళలకు,తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడన్నారు.పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించిన్నట్లు చెప్పారు.అదేవిదంగా వితంతువుల కోసం వసతిగృహాన్ని కూడా స్థాపించాడన్నారు.భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో పూలే దంపతులు ఉన్నారన్నారు.కావున పూలే దంపతుల ఆశయ సాధన కోసం కుల వివక్ష పోరాట సమితి నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమలో కార్యదర్శి సూరి,శ్రావణ్, బీసన్న,మహేష్,చిట్టీబాబు, బి.రాజు,అయ్యస్వామి,వెంకటేష్,జె.రాజు, కెవిపిఎస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Comments