సినీ పరిశ్రమను బెదిరించొద్దు...పిలిచి చర్చించండి...పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనపై సిపిఐ(యం) స్పందన...

సినీ పరిశ్రమను బెదిరించొద్దు...పిలిచి చర్చించండి...

పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనపై సిపిఐ(యం) స్పందన...

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : 

రాష్ట్రంలో సింగిల్‌ థియేటర్‌ యజమానులు తమ సమస్యల పరిష్కారం కోసం థియేటర్ల బంద్‌ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం సినిమా పరిశ్రమని బెదిరిస్తూ వాళ్లు తమ దగ్గరికి చర్చలకు రావాలని,గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరటం బెదిరించే పద్ధతిలో ఉన్నదని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అదే సినిమా రంగం నుండి వచ్చి ఈ రకంగా మొత్తం పరిశ్రమనే బెదిరించి తమ వద్దకు తెచ్చుకోవాలనే పద్ధతిలో వ్యవహరించడం సరికాదన్నారు. సినిమా నిర్మాతలు,థియేటర్ల యజమానుల సమస్యలు ఏమిటో తెలుసుకొని సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేయాలని, అందుకోసం ఆయా సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించి చర్చించాలని కోరారు.రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైనా ఇంతవరకు ఇక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి కాలేదన్నారు.సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. స్టూడియోలు నిర్మించుకొని విస్తరించడానికి ప్రభుత్వం దోహదపడాలని తెలిపారు.కావున వేలాది మంది కళాకారులు,ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆధారపడే సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ రంగంలోని ప్రముఖులను,థియేటర్లు, 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన సంఘాలను పిలిచి పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...