కన్నీటితో కాలం గడుపుతున్నా...అసెంబ్లీ రౌడీతో చిత్ర పరిచయం...పూట గడవని దీన స్థితిలో నటి పాకీజా...

కన్నీటితో కాలం గడుపుతున్నా
అసెంబ్లీ రౌడీతో చిత్ర పరిచయం
తమిళనాడులో ఆదరణ కరువు
పూట గడవని దీన స్థితిలో నటి పాకీజా

VS9TV న్యూస్,గుంటూరు ప్రతినిధి :

తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం లేని పేరు కాదు వాసుగి.తనదైన హావభావాలతో,సమయోచి త కామెడీ టైమింగ్‌తో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకు లను ఆకట్టుకున్న ఆమె,నేడు జీవిత పోరాటంలో క న్నీటితో కాలం గడుపుతున్నారు.ముఖ్యంగా 1991 లో వచ్చిన 'అసెంబ్లీ రౌడీ' చిత్రంలో 'పాకీజా' అనే పాత్ర ఆమెకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.కానీ ఆ తరువాత కాలంలో ఆమెకు అవ కాశాలు తగ్గిపోవడం,కుటుంబ పరిస్థితులు కుదుటపడక పోవడంతో నిత్యం పోరాటమే జీవితం అయ్యింది.ప్రస్తుతం పూట గడవని దీనస్థితిలో కొన్నిసార్లు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.తమిళనాడులో ఆదరణ కరువవడంతో ఏపీ ప్రభుత్వం తనను ఆదుకుం టుందన్న ఆశతో ఇక్కడికి వచ్చారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నా పరిస్థితిని వివరిస్తూ వీడియోలు తీసి :

చెన్నై నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన వాసుగిని గుంటూరులో మీడి యా ప్రతినిధులు పలకరించారు.ఈ సందర్భంగా ఆమె తన ప్రస్తుత దుర్భర పరిస్థితిని వివరి స్తూ భావోద్వేగానికి గురయ్యారు.'తమిళనాడులో నా పరిస్థితిని వివరిస్తూ వీడియోలు తీ సి ఎందరో నటులకు పంపినా ఎవరూ స్పందించలేదు.కానీ తెలుగు సినీ పరిశ్రమలోని చి రంజీవి,నాగబాబు,మోహన్ బాబు కుటుంబాలు నన్ను ఆదుకున్నాయి.ఒకవేళ వారు కూ డా ఆదుకోకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని' అని ఆమె తెలిపారు.వాసుగి స్వస్థలం తమిళనాడులోని కారైకుడి.

కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు :

మోహన్‌బాబు హీరోగా వచ్చిన 'అసెంబ్లీ రౌడీ' చిత్రంలో పాకీజా పాత్ర ఆమెకు ఎనలేని గు ర్తింపును తెచ్చిపెట్టింది.ఆ తర్వాత 'రౌడీగారి పెళ్లాం', 'పెదరాయుడు', 'అన్నమయ్య' వం టి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు అప్పటి తమిళనాడు సీఎం జయలలిత పిలుపు మేరకు ఆమె అన్నాడీఎంకే పార్టీలో చేరి రాజకీ యాల్లోకి అడుగుపెట్టారు.అప్పటినుంచి క్రమంగా సినిమాలకు దూరమయ్యారు.

జయలలిత తర్వాత తనను పట్టించుకునేవారే కరువు :

రాజ్‌కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన జీవితంలో కష్టాలు మొదలయ్యాయని వాసుగి వాపోయారు.అత్తమామల వేధింపులు,భర్త మద్యానికి బానిసై ఆస్తులు కరిగించడం వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.కొంతకాలానికి భర్త ఆ త్మహత్య చేసుకోవడంతో అత్తమామలు తనను ఇంటి నుంచి గెంటేశారని ఆమె కన్నీళ్లతో చెప్పారు.ఉన్న కొద్దిపాటి డబ్బును క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి చికిత్స కోసం ఖర్చు చే శానని వివరించారు.తన రాజకీయ గురువైన జయలలిత మరణం తర్వాత తనను పట్టిం చుకునేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే నన్ను ఆదుకోవాలి :

తెలుగువారే నాకు అన్నం పెట్టారు.ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే నన్ను ఆదు కోవాలి.సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి నా గోడు వెల్లడించు కోవాలని ఉంది.నాకు ఒక పింఛన్ సౌకర్యం కల్పిస్తే బతికినంత కాలం వారి పేరు చెప్పు కుని జీవిస్తాను.అవసరమైతే వారి కోసం ఊరూరా తిరిగి ప్రచారం కూడా చేస్తాను' అని వాసుగి విజ్ఞప్తి చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...