ధర్మస్థల హత్యోదంత ఘటనల దర్యాప్తును వేగవంతం చేయాలి...నిందితులను అరెస్టు చేసి కటినంగా శిక్షించాలి...

ధర్మస్థల హత్యోదంత ఘటనల దర్యాప్తును వేగవంతం చేయాలి
నిందితులను అరెస్టు చేసి కటినంగా శిక్షించాలి
ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య ఎన్ ఎఫ్ ఐడబ్ల్యూ డిమాండ్

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
 కర్ణాటక రాష్ట్రం,మంజునాథ దేవాలయం ధర్మస్థలంలో గత వారం రోజులుగా వెలుగులోకి వస్తున్న వందలాది మంది యువతులు,మహిళలపై దారుణమైన అత్యాచారం,హత్యోదం తం ఘటనలు భయానకంతో పాటు తీవ్రమైన ఆవేధనను,ఆందోళనను కల్గిస్తున్నాయినీ, ఈ హత్యోదంత ఘటనలపై సమగ్ర దర్యాప్తును జరిపి దోషులను కటినంగా శిక్షించాలని ఆంధ్రపదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ ఎఫ్ ఐడబ్ల్యూ) డిమాండ్ చేస్తూ సోమవారం కర్నూ లు కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర సమితి పిలుపు మేరకు మహిళా సమాఖ్య నగర అ ధ్యక్షురాలు నాగేంద్రమ్మ అధ్యక్షతన సోమవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా ఏ పి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గిడ్డమ్మ,జిల్లా ఉపాధ్యక్షురాలు రేణుక,నగర కార్య దర్శి వి.భారతిలు మాట్లాడుతూ ఈ హత్యోదంత పరంపర మనసును కలిచి వేస్తుంద ని,ఆశ్రమాల పేరుతో,ఆలయాల పేరుతో,ఆధ్యాత్మిక చింతన పేరుతో,భక్తి పేరుతో మహిళ లను వంచిస్తూ, సమాజంలో పెద్ద మనుషులుగా మతగురువులుగా,చెలామణి అవుతూ మ హిళల మాన ప్రాణాలను హరించివేస్తున్నారని,తమకున్న అధికార బలం అండబలం,డబ్బు పలుకుబడితో చేసిన నేరాలు బయట పడకుండా నిర్దోషులుగా చెలామణి అవుతున్నారన డానికి ప్రత్యక్ష సాక్ష్యం ధర్మస్థల ఉదంతాలే అన్నారు.1998 నుండి 2014 వరకు దాదా పు 500పైగా అమ్మాయిలు శవాలు పూడ్చిపెట్టారంటే ఆరాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు చూపిన నిర్లక్ష్యం కనిపిస్తుందని,ధర్మస్థల యాజమాన్యం నేరాల సాక్ష్యాధారా లను కూడా లేకుండా చేశారని,ప్రభుత్వంను కూడ తమ కనుసన్నలలో ఉండేలా చేసుకు న్నారనే అభిప్రాయం కలుగుతోందన్నారు.ఈ కేసు మొదట జూన్,22న దాదాపు ఒక నెల క్రితం వెలుగులోకి వచ్చిందినీ,ప్రభుత్వం ఆలస్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది మరియు జూలై 14న మాత్రమే అని,అదికూడా విజిల్ బ్లోవర్ అయిన మాజీ పారి శుద్ధ్య కార్మికుడు బయటకు వచ్చి తను చేసిన పాపాలను చెప్పుకోవాలి అనే భావంతో తనతో బలవంతంగా ఖననం చేయించిన మృతదేహాలను బయటకు తీయమని కోరా డు.జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు పారిశుద్ధ్య కార్మికుడి ఒప్పుకోలు స్టేట్మెంట్ లో లైంగిక దాడులు,హత్యలు, ఖననాలు,దహన సంస్కారాల యొక్క భయంకరమైన వివరాల వెల్లడి సభ్యసమాజం భయంతో నివ్వెర పోయేలా వుంది అన్నారు.1998 నుండి 2014 వరకు వందలాది మందిపై అత్యాచారాలు,హత్యలు,దహనం లేదా ఖననం చేయబడుతున్నా యని,\ఇప్పటివరకు అది వెలుగులోకి రాకపోవడం దిగ్భ్రాంతికరం.2014 తరువాత ఇం కెన్ని జరిగాయో,తలుచుకుంటే భయంగా ఉందన్నారు.కొంతమంది తల్లిదండ్రులు ఫిర్యా దులు చేసినప్పటికీ ధర్మస్థల పోలీసులు పూర్తిగా ఉదాసీనంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో సౌజన్య,అనన్యాబట్ మిస్సింగ్ విషయంలో పోలీస్ సమగ్ర దర్యాప్తు చే సి నిజానిజాలు బయటకు తీసి దోషులకు శిక్షలు పడే విధంగా చేసివుంటే వుంటే కొన్ని అనర్థాలు అగేవి అన్నారు. ముఖ్యంగా ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో నమోదైన తప్పిపోయిన వారందరి స్థితి నివేదికను తయారు చేయాలినీ,ఇది ధర్మస్థల ఆలయ ట్రస్ట్ యొక్క ప్రభా వం,శక్తి,రాజకీయ శక్తికి వారి సామీప్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తుందనీ,కర్ణాటక రాష్ట్ర ప్రభు త్వం బాధితులకు న్యాయం చేయడం,నిందితులు ఎంత శక్తివంతులైనా శిక్ష నుండి బయ టపడకుండా చేయాలనే రాజ్యాంగ విధిని తప్పకుండా నెరవేర్చాలనీ,ట్రస్ట్ ల పేరుతో ఆశ్ర మాల పేరుతో నడుస్తున్న సంస్థల కార్యకలాపాలపై పోలీస్ అధికారులు నిఘా ఉంచాలని డిమాండ్ చేశారు.భేటీ బచావో,బీటీ పడావో అనే బీజేపీ నినాదం అమ్మాయిలని అనుభ వించండి,చంపండి పూడ్చి పెట్టండి.అనుకునే విదంగా ఉందని హిందువునని గర్వించు... హిందువుగా జీవించు అంటూ ప్రచారం చేసే బీజేపీ హిందూత్వ ముసుగులో మహిళల మాన ప్రాణాలను దోచుకోవడమే ప్రధానంగా పెట్టుకున్నట్లు ఈ ఘటనలో అర్థ మవుతుం దని అన్నారు.బిజేపీ నాయకులే మంజునాథ్ దేవాలయం ట్రస్టీలుగా ఉన్నారని వారి కను సన్నల్లోనే ఈ అరాచకాలన్నీ జరిగాయని తెలుస్తున్నట్లు చెప్పారు.ఇదే కాదు గతంలో ఆం ధ్రప్రదేశ్ లో పుట్టపర్తి,విశాఖపట్నం,మహారాష్ట్ర,కర్ణాటక,పలు రాష్ట్రాల్లో బాబాల పేరుతో, స్వామీజీల పేరుతో,బ్రహ్మ కుమారిల పేరుతో ఆధ్యాత్మిక గురువులు పేరుతో అ మ్మాయిలను వంచించి వెలుగులోకి వచ్చిన కేసులు కోకొల్లలు..వీటి మీద ప్రభుత్వాలు నిఘా ఉంచక పోవడం వల్ల ఇటువంటి అరాచకాలకు అంతులేకుండా ఉందన్నారు.ధర్మ స్థల ఉదంతం పై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి,దోషులను కఠినంగా శిక్షించాలని వారు డి మాండ్ చేశారు.ఈ ఉదంతాన్ని బయట పెట్టిన పారిశుద్ధ్య కార్మికుడు వి జిల్ బ్లోయర్ కు అతని కుటుంబానికి రక్షణ కల్పించాలి,నిందితులు సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉం డేలా మృతదేహాలను వెంటనే వెలికి తీసేందుకు ఆదేశాలు ఇవ్వాలి.పిర్యాదు దారులకు, పారిశుధ్య కార్మికుడు విజిల్ బ్లోయర్ తరుపు న్యాయవాదులకు రక్షణ కల్పించాలి.రాజకీ య జ్యోక్య లేకుండా సిట్ తన దర్యాప్తు సమగ్రంగా నిర్వర్తించడానికి అనుమ తించాలని వారు డిమాండ్ చేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో నగర నాయకురాళ్లు పావని,విజయ, సుధా,కోటమ్మ,వెంకటేశ్వరమ్మ,సులోచనమ్మ,చంద్రకళ,ఆశాబేగం,రాములమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Comments