వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపేసిన భార్య...
వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపేసిన భార్య
హైదరాబాద్–సరూర్ నగర్ పీఎస్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య,ప్రి యుడు కలిసి భర్తను హత్య చేసిన దారుణం చోటు చేసుకుంది.వివరాలు ఇలా ఉన్నా యి...కోదండరాం నగర్ రోడ్డు నెం.7లో జెల్లెల శేఖర్(40),చిట్టి(33)లు నివాసం ఉంటు న్నారు.గత కొంతకాలంగా హరీష్ అనే వ్యక్తితో చిట్టి వివాహేతర సంబంధం కొనసాగి స్తోంది.ఈ నేపథ్యంలో రాత్రి భర్త పడుకోగానే,ప్రియుడిని పిలిచి ఇద్దరు కలిసి శేఖర్ ను హత్య చేశారు.ఉదయం ఏమి తెలియనట్లు నిద్రలోనే భర్త శేఖర్ చనిపోయినట్లు చిట్టి 100కు ఫోన్ ద్వారా సమాచారం తెలిపింది.అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా,తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు చిట్టి ఒప్పుకుంది.చిట్టిని అ రెస్ట్ చేసిన పోలీసులు..పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం గాలింపు చర్యలు చేప ట్టారు.
Comments
Post a Comment