మద్యం మత్తులో మహిళపై అఘాయిత్యానికి పాల్పడి,కొట్టిన వ్యక్తికి మహిళల బాదుడు..

మద్యం మత్తులో మహిళపై అఘాయిత్యానికి పాల్పడి 
కొట్టిన వ్యక్తికి మహిళల బాదుడు
పోలీసులు కేసు నమోదు

VS9TV న్యూస్,మందమర్రి :
మందమర్రి పట్టణం ఫస్ట్ జోన్ కు చెందిన 55 సంవత్సరాలు కలిగిన మహిళపై అఘాయి త్యానికి పాల్పడి,కొట్టిన వ్యక్తికి స్థానిక మహిళలు చెట్టుకు కట్టేసి,తగిన గుణపాఠం చెప్ప డంతోపాటు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉ న్నాయి...మహిళ ఇంటి ముందు గంధం శ్రీకాంత్ (31) అనే యువకుడు నివాసం ఉన్నా డు.అయితే తాను ఇంట్లో చేసిన పప్పు ఉడికిందా? లేదా ? చూడటానికి బాధితురాలిని తన ఇంట్లోకి పిలిపించుకున్నాడు.ఆమె లోపలికి వచ్చిన వెంటనే తలుపులు మూసి,ఆమె ను చేతులతో ఇష్టం వచ్చినట్లు కొడుతూ,వెయ్యి రూపాయలు ఇస్తాను.నేను చెప్పినట్లు వి ను.లేకుంటే నేను చంపేస్తాను అని బెదిరింపులకు పాల్పడ్డాడు.ఈ నేపథ్యంలో మహిళ భ యంతో గట్టిగా అరవడంతో,దగ్గర్లో ఉన్న బాధితురాలి కోడలు వచ్చి నిందితుని ఒక ఇంటి డోర్ కొట్టడంతో,నిందితుడు వెనుక గోడ దూకి పారిపోతుండగా స్తనికులు పట్టుకుని చె ట్టుకు కట్టి చెప్పులతో గుణపాఠం చెప్పారు.ఈ సంఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు మందమరి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Comments