మెగా డిఎస్ సి అభ్యర్ధులకు పోస్టుల ఎంపికకు అవకాశం ఇవ్వాలి...ఆప్టా...

మెగా డిఎస్ సి అభ్యర్ధులకు పోస్టుల ఎంపికకు 
అవకాశం ఇవ్వాలి...ఆప్టా

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
మెగా డిఎస్ సి అభ్యర్ధులకు పోస్టుల ఎంపికకు అవకాశం ఇవ్వాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ఎజిఎస్ గణపతి రావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కా కి ప్రకాష్ రావు లు బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్ సి ఎంతో మంది నిరుద్యోగులకు ఊరట ని చ్చింది.మెగా డిఎస్ సి యందు అనేక రకాల హోదాలు కల ఉద్యోగాలు ఉన్నందున దరఖా స్తు సమయంలో ఆప్షన్ అడగటం జరిగిందన్నారు.అందుకు అనుగుణంగా అభ్యర్ధులు ఆ ప్షన్ లు ఇవ్వడం జరిగింది.కొంత మంది అవగాహన లోపం వలన మరియు పోస్ట్ ల సంఖ్య చూసి మొదట ఆప్షన్ సెకండరీ గ్రేడ్ టీచర్ కు ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం వారి లో కొంతమందికి స్కూల్ అసిస్టెంట్,ప్రిన్సిపల్ పోస్ట్ లకు ఉత్తీర్ణత సాధించిన మొదటి ఆ ప్షన్ కు కట్టుబడి ఉండడం వలన వారు నష్ట పోతున్నారని అన్నారు.కాబట్టి ఇప్పుడు మె గా డిఎస్ సి యందు ఉత్తీర్ణులు అయిన వారికి మరోసారి డిఎస్ సి యందు ఉద్యోగాల ఎంపికకు అవకాశం ఇవ్వాలని ఎపి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షు లు ఎజిఎస్ గణపతి రావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావులు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు,పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ,పాఠశాల వి ద్యా శాఖ కమిషనర్ లను కోరారు.

Comments