విద్యుత్తు ఉద్యమ అమరవీరుల సాక్షిగా మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతాం...వామపక్ష పార్టీల నాయకులు ప్రతిజ్ఞ...
విద్యుత్తు ఉద్యమ అమరవీరుల సాక్షిగా మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతాంవామపక్ష పార్టీల నాయకులు ప్రతిజ్ఞ
బషీర్బాగ్ విద్యుత్ అమరవీరుల సాక్షిగా చంద్రబాబు తీసుకున్న స్మార్ట్ మీటర్లకు,విద్యుత్ వా రాలకు వ్యతిరేకంగా మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని వామపక్ష పార్టీలు నాయ కులు,కార్యకర్తలు,ప్రతిజ్ఞ పూనారు.గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిల వర్ధంతి సందర్భంగా సిపి ఎం పార్టీ నగర కార్యదర్శి ఎం. రాజశేఖర్,సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి అధ్యక్ష తన ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది.కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య,సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప రిపాలనలో విద్యుత్ సంస్కరణలు తీసుకుని వచ్చిన సందర్భంగా దాదాపు ఆరు నెలలపాటు విద్యుత్ పోరాటం జరిగిందని,ఆ పోరాటం ఉదృతం కావడానికి కర్నూలు జిల్లా అనే నాంది పలికిందని 2000 సంవత్సరం జూలై,28వ తేదీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన బ హిరంగ సభలో చంద్రబాబు ఉపన్యాసాన్ని అడ్డుకుని విద్యుత్ సంస్కరణలో వెనక్కి తీసుకె ళ్లాలని మహా ఉద్యమాన్ని చేపట్టామని అన్నారు.చంద్రబాబు సభ భగ్నం అయిందని,అదే విద్యుత్ పోరాటానికి నాంది పలికిందని వారు తెలిపారు.
ఆ తర్వాతనే 2000 సంవత్సరం ఆగస్టు,28వ తేదీన వేలాదిమంది ప్రజలు అసెంబ్లీ ము ట్టడి కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు.ఆ సందర్భంగా దుర్మార్గంగా చంద్రబాబు ప్రభు త్వం బషీర్బాగ్ దగ్గర కాల్పులు జరిపిందని,లాఠీచార్జీ చేసిందని,ఆ సందర్భంగా రామకృ ష్ణ వర్ధన్ రెడ్డి బాలస్వామి మృతి చెందారని గుర్తు చేశారు.ఆ తరువాత దాదాపు 15 సం వత్సరాల పాటు చంద్రబాబు నాయుడును అధికారానికి ప్రజలు దూరం పెట్టారని తెలియ జేశారు.ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి న చంద్రబాబు నాయుడు విద్యుత్ చాలు చేయల జోలికి వెళ్ళను అని చెప్పాల్సిన పరిస్థి తి వచ్చిందని వారు తెలిపారు.మళ్లీ తిరిగి 2017లో ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయడం మొదలు పెట్టారని వారు విమర్శించారు. దానిని ఆ తర్వాత వచ్చిన జ గన్మోహన్ రెడ్డి పాలనలో అలాగే కొనసాగించాడని చంద్రబాబు నాయుడు కంటే ఒక అడుగు ముందుకు వేసి హదానితో సెఖీ ఒప్పందాలు చేసుకొని కొత్తగా స్మార్ట్ మీటర్లు పె ట్టే విధానాన్ని తీసుకుని వచ్చాడని అందుకోసమే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పం పించారని వారు ఘాటుగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో తండ్రి కొడుకులు చంద్రబాబు,లోకేష్ ఇద్దరు కలిసి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టా రని,స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని ప్రజలకు పిలుపునిచ్చిన ఈ మహానుభావులు అధి కారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే జగన్మోహన్ రెడ్డి ఏ మీటర్లు అయితే ప్రజలకు పెట్టాడో అవే స్మార్ట్ పీటర్లను అదే ట్రూ ఆఫ్ చార్జీలను తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టాడని,దానివల్ల ఈ 11 నెలల కాలంలో రూ.15వేల కోట్లు ప్రజలపై భారం మోకారని,ఇంతకంటే దుర్మా ర్గమైన పని మరొకటి ఉండదని వారు ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమాన్ని మర్చిపోతే శాశ్వతం గా రాజకీయాలనుంచి ప్రజలు దూరం పెట్టాల్సిన కాలం ఎంత దూరంలో లేదని వారు వి మర్శించారు.ఇప్పటికైనా ఎన్నికల ముందు తాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం స్మార్ట్ మీటర్ల పెట్టే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని,షకీ ఒప్పందాలను రద్దు చేయాలని అదా నీపై జగన్మోహన్ రెడ్డిపై కేసులు నమోదు చేయాలని వారు తెలిపారు.అది చేయకపోతే రాష్ట్రంలో వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని మరో విద్యుత్ ఉద్యమా న్ని చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.అనంతరం నాయకులు,కార్యకర్తలు వి ద్యుత్ ఉద్యమ అమరవీరుల సాక్షిగా మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని ప్రతిజ్ఞ పూ నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రాధాకృష్ణ,ఆనంద్ బాబు,గురు శేఖ ర్,సిపిఐ జిల్లా నాయకులు జగన్నాథం,మునెప్ప,లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment