విజ్ఞాలు తొలగాలి...అందరూ అభివృద్ధి చెందాలి...ఘనంగా కర్నూలు పాత్రికేయ గణేష్ ఉత్సవ కమిటీ పూజలు ప్రారంభం...
విజ్ఞాలు తొలగాలి...అందరూ అభివృద్ధి చెందాలిఘనంగా కర్నూలు పాత్రికేయ గణేష్ ఉత్సవ కమిటీ పూజలు ప్రారంభంమహబూబ్ బాషా,ఆంధ్రఅక్షర అధినేతమట్టి వినాయకుణ్ణి పూజిద్దాం పర్యావరణం కాపాడుకుందాంపాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ
సమాజంలో విజ్ఞాలు తొలగాలి... అందరూ అభివృద్ధి చెందాలని ఆంధ్రఅక్షర అధినేత మ హబూబ్ బాషా వ్యక్తం చేశారు.బుధవారం వినాయక చవితి పురస్కరించుకొని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం,సమాచార శాఖ భవన్ వద్ద పాత్రికేయ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాధుని పూజలు ఘనంగా నిర్వహించారు.మొదటి రోజు పూజలు జర్న లిస్ట్ లు నీలం సత్యనారాయణ,విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు పూజలు జరిపారు.కా ర్యక్రమానికి విగ్రహ ప్రధాత, ఆంధ్రఅక్షర అధినేత మహబూబ్ బాషా హాజరయ్యారు.
ఈ సందర్బంగా మహబూబ్ బాషా మాట్లాడారు.ముందుగా కర్నూలు జిల్లా ప్రజలకు వినా యక చవితి శుభాకాంక్షలు తెలియచేశారు.పాత్రికేయులు సైతం వినాయక చవితి పం డుగను జరుపుకోవడం శుభపరిణామం అన్నారు.పాత్రికేయ గణేష్ ఉత్సవ కమిటీ బృం దం మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలనుండి పాత్రికేయులు,దాతల సహకారంతో సంయుక్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నట్లు పేర్కొన్నారు.నేటి నుండి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు పురస్కరించుకొని అల్పాహారం,అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పారు.
పర్యావరణం కాపాడుకోవడంలో పాత్రికేయులు బాధ్యతను స్వీకరిస్తూ మట్టి వినాయక విగ్రహాలను పూజిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రభుత్వాలు పర్యావ రణం కాపాడుకుందాం అంటూ చేస్తున్న ప్రకటనలు ఆచరణలో విఫలం చెందుతున్నా యని అన్నారు.ప్లాస్టిక్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిషేదించాలని కోరారు.మట్టి వినాయకుల కు అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యతను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక దృష్టి సారిం చాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయ బృందం,దండు విద్యాసాగర్,కె.శ్రీ నివాసులు,అవినాష్,మంజునాధ్,ప్రకాష్,సాయికుమార్ నాయుడు,వి.విజయ్ కుమార్,కి షోర్,మోహన్,గంగాధర్,పరమేష్,రాఘవేంద్ర,ఆయాసంస్థల జర్నలిస్ట్లు,కెమెరామెన్లు,భ క్తులు పాల్గొన్నారు.
Comments
Post a Comment