పందిపాడు,ఇందిరమ్మ కాలనీలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు...
పందిపాడు,ఇందిరమ్మ కాలనీలో అంగరంగవైభవంగా వినాయక చవితి వేడుకలు
కల్లూరు మండలం,స్థానిక పందిపాడు,ఇందిరమ్మ కాలనీలో వినాయక చవితి వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి.శ్రీ గోడల ఆంజనేయ స్వామి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు.ఈ వేడుకల్లో భాగంగా కమిటీ సభ్యులు శేఖర్ రెడ్డి,రాము,నాగేంద్రుడు,నాగ రాజు,అన్వర్ భాష,మౌలాలి,షేక్షావలిలతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజర య్యారు.భక్తులు ఉదయం వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.భక్తుల కు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.కార్యక్రమం విజయవంతం కావడానికి కమిటీ సభ్యు లు,కాలనీ వాసులు విశేష కృషి చేశారు.ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాం స్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ వేడుకలు కాలనీలో ఆధ్యాత్మిక వా తావరణాన్ని నింపాయి.
Comments
Post a Comment